Atlee Baby Girl: రాకా సెట్స్‌లో డబుల్ ధమాకా- నిన్న దీపికా పదుకొణె, నేడు అట్లీ- మరోసారి తండ్రి అయిన డైరెక్టర్!

Director Atlee Blessed With Baby Girl Today: అల్లు అర్జున్ రాకా మూవీ డైరెక్టర్ అట్లీ కుమార్ రెండోసారి తండ్రిగా మారాడు. అట్లీ, ప్రియ దంపతులకు ఇవాళ పండంటి ఆడబిడ్డ జన్మించింది. నిన్న దీపికా పదుకొణె తను రెండోసారి గర్భవతిని అని ప్రకటించగా నేడు అట్లీ తండ్రి కావడం యాదృచ్ఛికంగా విశేషంగా మారింది.

Published on: Apr 20, 2026, 11:47:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Director Atlee Blessed With Baby Girl Today: టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఇంట్లో వేడుకలు మొదలయ్యాయి. అట్లీ, ప్రియ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. సోమవారం (ఏప్రిల్ 20) ఈ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించింది.

రాకా సెట్స్‌లో డబుల్ ధమాకా- నిన్న దీపికా పదుకొణె, నేడు అట్లీ- మరోసారి తండ్రి అయిన డైరెక్టర్!
రాకా సెట్స్‌లో డబుల్ ధమాకా- నిన్న దీపికా పదుకొణె, నేడు అట్లీ- మరోసారి తండ్రి అయిన డైరెక్టర్!

మీర్ పెద్దన్నయ్య అయ్యాడు

డైరెక్టర్ అట్లీ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "బ్లెస్డ్" (దీవించబడ్డాం) అనే క్యాప్షన్‌తో తన కుమారుడు మీర్ పెద్దన్నయ్య అయ్యాడంటూ ఒక క్యూట్ పోస్టర్‌ను షేర్ చేశారు. "యే.. నాకు చెల్లి వచ్చింది! మీర్ ఇప్పుడు పెద్దన్నయ్య. మాకు ఆడబిడ్డ పుట్టింది - ఏప్రిల్ 20, 2026" అంటూ ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.

అట్లీ, ప్రియ దంపతులకు 2014లో వివాహం జరగ్గా, ఎనిమిదేళ్ల తర్వాత 2023 జనవరిలో మొదటి సంతానం మీర్ జన్మించాడు. ఇప్పుడు సరిగ్గా మూడేళ్ల వ్యవధిలోనే చిన్నారి రాకతో వారి కుటుంబం సంపూర్ణమైంది. ఈ వార్త తెలియగానే టాలీవుడ్ హీరోయిన్ సమంత, కాజల్ అగర్వాల్, బాలీవుడ్ భామలు అనన్య పాండే, హ్యూమా ఖురేషి వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు.

'రాకా' సెట్స్‌లో డబుల్ ధమాకా

అయితే, అట్లీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా' టీమ్ అంతా ఇప్పుడు సెలబ్రేషన్ మూడ్‌లో ఉంది. యాదృచ్ఛికంగా అట్లీకి కూతురు పుట్టిన ఒకరోజు ముందే అంటే నిన్న (ఏప్రిల్ 19) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొణె తాను రెండోసారి గర్భవతినని ప్రకటించారు. ఈ లెక్కన అల్లు అర్జున్ రాకా సినిమాకు పనిచేస్తున్న నిన్న దీపికా పదుకొణె, నేడు డైరెక్టర్ అట్లీ ఇద్దరు గుడ్ న్యూస్ చెప్పారు.

ఇదిలా ఉంటే, అట్లీ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల బన్నీ పుట్టిన రోజున విడుదల చేసిన 'రాకా' ఫస్ట్ లుక్ - అందులో ఆయన గుండుతో కనిపించిన తీరు ఇండస్ట్రీని షేక్ చేసింది.

గర్భవతిగా ఉన్నా తగ్గని దీపికా జోరు

మరోవైపు, దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ సమయంలోనూ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. 'రాకా' సినిమాలో ఆమె చేయాల్సిన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

"దీపికా తన ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఎంతో రిస్క్ తీసుకుని భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. సినిమా షెడ్యూల్ దెబ్బతినకుండా ఆమె షూటింగ్‌ను కొనసాగిస్తారు" అని రాకా చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస సక్సెస్‌లతో కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న అట్లీకి, వ్యక్తిగత జీవితంలోనూ ఈ ఆనందం తోడవడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. డైరెక్టర్ అట్లీకి ఎప్పుడెప్పుడు సంతానం కలిగింది?

అట్లీ, ప్రియ దంపతులకు ఏప్రిల్ 20, 2026న ఆడబిడ్డ జన్మించింది. వీరికి ఇప్పటికే 2023లో పుట్టిన మీర్ అనే కుమారుడు ఉన్నాడు.

2. అట్లీ ప్రస్తుతం ఏ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు?

అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'రాకా' (Raaka) చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.

3. 'రాకా' సినిమాలో దీపికా పదుకొణె రోల్ ఏంటి?

ఈ సినిమాలో దీపికా పవర్‌ఫుల్ యాక్షన్ రోల్ పోషిస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికీ ఆమె ఈ సినిమా కోసం రిస్కీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొంటున్నారు.

4. 'రాకా' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More