Jonita Gandhi: శ్రీలీల, తమన్నా, సమంత, పూజా హెగ్డే సరసన చేరిన బ్యూటిపుల్ సింగర్- డ్యాన్స్‌తో జోనితా గాంధీకి క్రేజ్!

Singer Jonita Gandhi After Sreeleela Tamanna Samantha: స్టార్ హీరోయిన్లు శ్రీలీల, సమంత, తమన్నా, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, కాజల్ సరసన చేరిపోయింది బ్యూటిపుల్ సింగర్ జోనితా గాంధీ. అడవి శేష్‌తో కలిసి చిచ్చు బుడ్డి సాంగ్‌లో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసింది. అలా జోనితాకి విపరీతమైన క్రేజ్ పెరిగింది.

Published on: Mar 29, 2026, 22:17:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త మ్యాజిక్ జరగబోతోంది. 'వాట్ ఝుమ్కా?', 'సోనీ సోనీ', 'మా మా మహేషా' వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన క్రేజీ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు తన గళంతోనే కాదు, తన డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను మాయ చేసింది.

శ్రీలీల, తమన్నా, సమంత, పూజా హెగ్డే సరసన చేరిన బ్యూటిపుల్ సింగర్- డ్యాన్స్‌తో జోనితా గాంధీకి క్రేజ్!
శ్రీలీల, తమన్నా, సమంత, పూజా హెగ్డే సరసన చేరిన బ్యూటిపుల్ సింగర్- డ్యాన్స్‌తో జోనితా గాంధీకి క్రేజ్!

అడివి శేష్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్' (Dacoit) లో జోనితా గాంధీ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఈ పాటను రామ్ మిర్యాలతో కలిసి పాడటమే కాదు అడవి శేష్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది బ్యూటిపుల్ సింగర్ జోనితా గాంధీ. దీంతో జోనితా గాంధీ పేరు మారుమోగిపోతింది.

డ్యాన్సర్‌గా జోనితా విశ్వరూపం!

సాధారణంగా సింగర్లు తెర వెనుక పాడుతుంటారు, లేదా మ్యూజిక్ వీడియోల్లో కనిపిస్తుంటారు. కానీ, జోనితా గాంధీ మాత్రం ఈ సినిమాలో ఏకంగా అడివి శేష్‌తో కలిసి స్టెప్పులేశారు. 'చిచ్చుబుడ్డి' అనే పేరుతో వచ్చిన ఈ పెప్పీ ట్రాక్‌లో జోనితా గాంధీ అదిరిపోయే ఎనర్జీని ప్రదర్శించారు.

అడివి శేష్ వంటి గ్రేస్ ఉన్న హీరోతో పోటీ పడి డ్యాన్స్ చేయడానికి జోనితా చాలా రోజుల పాటు కఠినంగా ప్రాక్టీస్ చేశారని సమాచారం. స్క్రీన్ మీద ఆమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

స్టార్ హీరోయిన్ల సరసన జోనితా..

ఇప్పటివరకు శ్రీలీల, తమన్నా, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, సమంత, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు మాత్రమే తెలుగు సినిమాల్లో స్పెషల్ (ఐటమ్) సాంగ్స్‌తో థియేటర్లను దడదడలాడించారు. ఇప్పుడు వీరి సరసన జోనితా గాంధీ కూడా ఆ లీగ్‌లోకి చేరిపోయారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక హిట్ సాంగ్ ఇచ్చే క్రేజ్ కొన్నిసార్లు ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చే పాపులారిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని జోనితా చక్కగా అందిపుచ్చుకున్నారని చెప్పాలి.

వెండితెరపై తన ముద్ర

కేవలం తన ఇండిపెండెంట్ మ్యూజిక్, లైవ్ షోలతోనే కాకుండా, ఇప్పుడు వెండితెరపై కూడా తన ముద్ర వేయడానికి జోనితా గాంధీ సిద్ధమయ్యారు. అడివి శేష్, జోనితాల మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'డెకాయిట్' సినిమాలోని ఈ 'చిచ్చుబుడ్డి' పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్

ఇదిలా ఉంటే, భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ చిచ్చు బుడ్డి పాటను ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ రచించారు. జోనితా గాంధీ, రామ్ మిర్యాల ఆలపించారు. కాగా, ఈ మూవీలో అడవి శేష్ సరసన బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More