Badshah: స్కూల్ డ్రెస్సులో అమ్మాయిలతో అసభ్య డ్యాన్సులు- బాద్‌షాపై లేడి సింగర్ సోనా ఘాటు కామెంట్స్- దిగొచ్చిన ర్యాపర్!

Sona Mohapatra Slams Badshah: ర్యాపర్, సింగర్ బాద్‌షా లేటెస్ట్ సాంగ్ ‘తతీరీ’ (Tateeree) పెను వివాదానికి దారితీసింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న అమ్మాయిలను అసభ్యంగా చూపించడంపై హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, గాయని సోనా మోహపాత్ర అతడిపై నిప్పులు చెరిగారు. వివాదం ముదరడంతో బాద్‌షా క్షమాపణలు చెప్పారు.

Published on: Mar 11, 2026, 14:14:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్, సింగర్ బాద్‌షా మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. మార్చి 1, 2026న విడుదలైన బాద్‌షా కొత్త పాట ‘తతీరీ’ ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఈ పాటలో చూపించిన విజువల్స్, వాడిన లిరిక్స్ అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

స్కూల్ డ్రెస్సులో అమ్మాయిలతో అసభ్య డ్యాన్సులు- బాద్‌షాపై లేడి సింగర్ సోనా ఘాటు కామెంట్స్- దిగొచ్చిన ర్యాపర్!
స్కూల్ డ్రెస్సులో అమ్మాయిలతో అసభ్య డ్యాన్సులు- బాద్‌షాపై లేడి సింగర్ సోనా ఘాటు కామెంట్స్- దిగొచ్చిన ర్యాపర్!

నిప్పులు చెరిగిన సోనా మోహపాత్ర

ముఖ్యంగా హర్యానా రోడ్‌వేస్ బస్సులో పాఠశాల యూనిఫాం ధరించిన అమ్మాయిలతో అసభ్యకరమైన చేష్టలు చేయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బాద్‌షా తీరుపై గాయని సోనా మోహపాత్ర సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

సమాజపు ఆత్మను దెబ్బతీస్తోంది

"చిన్న పిల్లలను, స్కూల్ యూనిఫాంలను ఇలాంటి అసభ్యకర చిత్రణ కోసం వాడుకోవడం ఆపండి. ఇది మన సమాజపు ఆత్మను దెబ్బతీస్తోంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 'హర్యానా బిడ్డను' అని చెప్పుకుంటే సరిపోదని, కళాకారుడిగా సామాజిక బాధ్యత ఉండాలని సోనా మోహపాత్ర హితవు పలికారు.

"మగతనాన్ని ప్రదర్శించడం, ఆడవారిని కేవలం ఒక వస్తువులా (Objectifying) చూపించడం.. ఇదొక చెత్త ఫార్ములాగా మారిపోయింది. హర్యానాలో ఇప్పటికే లింగ నిష్పత్తి తక్కువగా ఉండటం, మహిళలపై హింస వంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాద్‌షా లాంటి వారు బాధ్యతగా ఉండాలి. ఈ 'సౌల్ లెగ్' కంటెంట్ కోసం డబ్బులు పోసి చూసేవారు కూడా తమ విజ్ఞతను వాడుకోవాలి" అని సింగర్ సోనా మోహపాత్ర ఘాటుగా స్పందించారు.

పోలీసుల యాక్షన్.. ఎఫ్ఐఆర్ నమోదు

ఈ పాటపై హర్యానా పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టారు. పాటలో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయన్న ఆరోపణలతో బాద్‌షాపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. అంతేకాకుండా, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ పాటను బాద్‌షాతో కలిసి సిమ్రన్ జగ్లాన్ ఆలపించారు.

వివాదం ముదరడంతో బాద్‌షా కిందకు దిగివచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ క్షమాపణలు కోరారు.

తప్పు ఒప్పుకున్న బాద్‌షా.. పాట తొలగింపు

"తతీరీ పాటలోని కొన్ని పదాలు, విజువల్స్ వల్ల నా హర్యానా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నాకు అర్థమైంది. నేను కూడా హర్యానా బిడ్డనే. మా సంస్కృతిని ప్రపంచానికి చాటాలనేది నా ఉద్దేశం కానీ, ఎవరినీ కించపరచాలని కాదు. హిప్ హాప్ శైలిలో ప్రత్యర్థులను ఉద్దేశించి రాసే పదాలు అమ్మాయిలకు లేదా పిల్లలకు తప్పుగా వెళ్లాయి. నన్ను మీ కొడుకుగా భావించి క్షమించండి" అని బాద్‌షా వేడుకున్నారు.

అంతేకాకుండా, వివాదాస్పదమైన ఈ పాటను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగిస్తున్నట్లు బాద్‌షా ప్రకటించారు. కేవలం గ్లామర్ కోసమో, పాపులారిటీ కోసమో విలువలను పక్కన పెట్టడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More