మీ జోకులు అహంకారంగా ఎందుకు అనిపిస్తాయి.. షారుఖ్ ఖాన్‌ను అడిగిన తాప్సీ.. బాలీవుడ్ బాద్‌షా సమాధానం ఇదే!
తాప్సీ పన్ను తన తాజా చిత్రం 'అస్సీ' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో 'డంకీ' షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్‌తో జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను తాప్సీ గుర్తుచేసుకున్నారు. సరదాగా వేసే జోకులు ఒక్కోసారి ఎలా వికటిస్తాయో కింగ్ ఖాన్ ఆమెకు వివరించారు.
ప్రస్తుతం ‘అస్సీ’ (Assi) అనే సోషల్ డ్రామాతో పలకరించిన తాప్సీ పన్ను తన నటనకు గానూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ పాడ్‌కాస్టర్ శుభంకర్ మిశ్రాతో మాట్లాడిన తాప్సీ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సెలబ్రిటీలు చేసే జోకులను జనం ఒక్కోసారి ‘అహంకారం’గా ఎలా పొరబడతారో తాప్సీ వివరించారు.

అహంకారం కాదు.. అది హ్యూమర్!
తాప్సీ మాట్లాడుతూ.. "మనం జోకులు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా ఇదే విషయాన్ని నేను 'డంకీ' సెట్స్‌లో షారుఖ్ సార్‌ను అడిగాను. సార్, నేను ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలుసు. చిన్నప్పుడు మీ జోకులు విని నేను ఎంతో ఎంజాయ్ చేసేదాన్ని, ఈలలు వేసేదాన్ని. కానీ, అవే జోకుల వల్ల జనం మీకు అహంకారం అని ఎంతల ట్రోల్ చేశారో కూడా చూశాను. నాకు నచ్చిన ఆ జోకులు చాలామందికి ఎందుకు అర్థం కాలేదు? ఆ పరిస్థితులను మీరు ఎలా ఎదుర్కొన్నారు? అని ఆయనను ప్రశ్నించాను" అని తాప్సీ పేర్కొన్నారు.
షారుఖ్ ఇచ్చిన అదిరిపోయే సమాధానం
తాప్సీ అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో బదులిచ్చారు. "మనం ఎవరి ముందు జోకులు వేస్తున్నామో, అవతలి వ్యక్తి వేవ్‌లెంగ్త్ (Wavelength) కూడా మనతో సరిపోవాలి. అప్పుడే ఆ జోక్ పండుతుంది. ఒకవేళ వాళ్ల ఆలోచనా విధానం మనతో సింక్ అవ్వకపోతే.. మనం వేసిన జోక్ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది" అని షారుఖ్ ఖాన్ వివరించినట్లు తాప్సీ తెలిపారు.
నిజానికి షారుఖ్ ఖాన్ వేసే చలోక్తులు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంటాయి. ఆయనలోని 'సెన్స్ ఆఫ్ హ్యూమర్'ను కొందరు మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ఆయనకు చాలా గర్వం, అహంకారం అని విమర్శిస్తుంటారు.
‘డంకీ’ ప్రయాణం..
ఇదిలా ఉంటే, 2023లో రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'డంకీ' చిత్రంలో తాప్సీ, షారుఖ్ కలిసి నటించారు. లండన్ వెళ్లాలనుకునే నలుగురు స్నేహితుల భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా కథ. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
తాప్సీ ప్రస్తుతం తన కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నానని, కంగనా రనౌత్‌తో ఉన్న పాత వివాదాలను పక్కన పెట్టి స్నేహం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఈ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


