ఆ హీరోయిన్ చెల్లి నన్ను చీప్ కాపీ అనడంలో ఇబ్బందిలేదు, మా గొడవ వల్ల ఎవరో ఒకరు లాభం పొందే ఉంటారు- తాప్సీ పన్ను క్లారిటీ!
బాలీవుడ్ హీరోయిన్స్ తాప్సీ పన్ను, కంగనా రనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరూ అనుకుంటారు. కానీ, తాప్సీ మాత్రం తాజాగా తన మనసులో మాట బయటపెట్టారు. కంగనాతో తనకు ఎప్పుడూ గొడవ జరగలేదని, అసలు తన నోటి నుంచి ఆమెకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదని స్పష్టం చేశారు.
బాలీవుడ్‌లో అవుట్‌సైడర్స్‌గా అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ కంగనా రనౌత్, తాప్సీ పన్ను. అయితే, వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

తాజాగా తన కొత్త సినిమా ‘అస్సి’ (Assi) ప్రమోషన్లలో భాగంగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న తాప్సీ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌తో గొడవపై మొదటిసారి పూర్తి క్లారిటీ ఇచ్చారు. దీంతో తాప్సీ పన్ను కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
గొడవ జరగడానికి ఇద్దరు కావాలి
శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న తాప్సీ మాట్లాడుతూ.. "మా మధ్య గొడవ ఎప్పుడు జరిగిందో నాకైతే తెలియదు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పరస్పరం గొడవ పడితేనే దాన్ని ఫైట్ అంటారు. కానీ, నేను ఎప్పుడూ తనతో తలపడలేదు. నా స్టేట్‌మెంట్స్ అన్నీ తీసి చూడండి, ఆమెకు వ్యతిరేకంగా నేను ఎప్పుడైనా ఒక్క మాటైనా మాట్లాడానా?" అని ప్రశ్నించారు.
గతంలో కంగనా సోదరి రంగోలి చందేల్ తాప్సీని ఉద్దేశించి ‘చీప్ కాపీ’ అని చేసిన వ్యాఖ్యల గురించి కూడా తాప్సీ స్పందించారు. "ఆమె సోదరి నన్ను చీప్ కాపీ అన్నారు. నేను ఆమె అంత సంపాదించలేను కాబట్టి నన్ను అలా పిలిచారు. ఒకవేళ కంగనా అంత గొప్ప నటి అయితే, ఆమెకు నేను కాపీ అనిపించుకోవడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు" అని తాప్సీ హుందాగా సమాధానమిచ్చారు.
స్టార్ కిడ్స్‌కు లాభమా?
ఇద్దరు అవుట్‌సైడర్స్ ఇలా గొడవ పడటం వల్ల ఇండస్ట్రీలోని స్టార్ కిడ్స్‌కు లాభం కలుగుతుందా? అన్న ప్రశ్నకు తాప్సీ ఆసక్తికరంగా స్పందించారు. "వారి గురించి నాకు తెలియదు కానీ, ఎవరో ఒకరు మాత్రం ఈ గొడవ వల్ల కచ్చితంగా లబ్ధి పొంది ఉంటారు. నా వైపు నుంచి ఎలాంటి పోరాటం లేకపోయినా, ఈ వివాదం ఎవరికో ఒకరికి ఉపయోగపడి ఉండవచ్చు" అని తాప్సీ అభిప్రాయపడ్డారు.
వరుస సినిమాలతో బిజీ
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తాప్సీ పన్ను ‘అస్సి’ (Assi) అనే కోర్ట్‌రూమ్ లీగల్ డ్రామాలో నటించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీతో పాటు కని కుస్రుతి కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమాపై విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు, కంగనా రనౌత్ ఇటీవల ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆమె ‘భారత భాగ్య విధాత’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


