మెదడుకు రక్తస్రావం, ఆస్పత్రిలో సల్మాన్ ఖాన్ తండ్రి- పరామర్శించిన షారుఖ్ ఖాన్- నిన్న రాత్రి గంటన్నరపాటుగా!

అనారోగ్యంతో ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ రచయిత, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌ను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పరామర్శించారు. బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్న 90 ఏళ్ల సలీం ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Published on: Feb 22, 2026, 08:43:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిగ్గజ స్క్రీన్ ప్లే రచయిత సలీం ఖాన్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిన్న శనివారం (ఫిబ్రవరి 21) రాత్రి పరామర్శించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి అయిన సలీం ఖాన్ (90) గత కొద్దిరోజులుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్లిష్ట సమయంలో సల్మాన్ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు షారుఖ్ స్వయంగా వెళ్లడం టాపిక్‌గా మారింది.

మెదడుకు రక్తస్రావం, ఆస్పత్రిలో సల్మాన్ ఖాన్ తండ్రి- పరామర్శించిన షారుఖ్ ఖాన్- నిన్న రాత్రి గంటన్నరపాటుగా!
మెదడుకు రక్తస్రావం, ఆస్పత్రిలో సల్మాన్ ఖాన్ తండ్రి- పరామర్శించిన షారుఖ్ ఖాన్- నిన్న రాత్రి గంటన్నరపాటుగా!

ఆసుపత్రిలో గంటన్నర పాటు షారుఖ్

షారుఖ్ ఖాన్ ఆసుపత్రి లోపలికి వెళ్తున్న దృశ్యాలు బయటకు రాకపోయినప్పటికీ, ఆయన కారు లీలావతి ఆసుపత్రిలోకి వెళ్లడం, సుమారు గంటన్నర తర్వాత తిరిగి బయటకు రావడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

షారుఖ్ ఖాన్ అక్కడ ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ కూడా తన తండ్రి దగ్గరే ఉన్నట్లు సమాచారం. మూడు దశాబ్దాలుగా షారుఖ్, సల్మాన్ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. తన కెరీర్ ఎదుగుదలలో సలీం ఖాన్ ప్రభావం ఎంతో ఉందని షారుఖ్ ఖాన్ పలు సందర్భాల్లో కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు.

సలీం ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

ఫిబ్రవరి 17న సలీం ఖాన్‌కు స్వల్పంగా మెదడులో రక్తస్రావం (Brain Haemorrhage) కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆయనను ఐసీయూలో నిశితంగా పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.

"సలీం ఖాన్‌కు ఎటువంటి సర్జరీ అవసరం పడలేదు. ఆయనకు జరిగింది చాలా స్వల్ప రక్తస్రావం మాత్రమే. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది" అని లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ జలీల్ పార్కర్ వివరించారు. సలీం ఖాన్‌ను ఇప్పటికే అమీర్ ఖాన్, జావేద్ అక్తర్ వంటి పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.

భారతీయ సినిమాను మార్చేసిన మేధావి

సలీం ఖాన్ 60వ దశకంలో నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటికీ, 70, 80వ దశకాల్లో రచయితగా బాలీవుడ్‌ను శాసించారు. సలీం-జావేద్ ద్వయం (సలీం ఖాన్, జావేద్ అక్తర్) భారతీయ సినిమాల్లో 'యాంగ్రీ యంగ్ మ్యాన్' శకాన్ని సృష్టించింది.

షోలే, దీవార్, జంజీర్ వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు వీరిద్దరు కథలు అందించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రచయితగా సలీం ఖాన్‌కు ఎంతో గౌరవం ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More