షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో సినిమా చేసే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు, నాకు అదే ముఖ్యం.. ఓటీటీ సిరీస్ డైరెక్టర్ కామెంట్స్

బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లతో పని చేయాలని ప్రతి దర్శకుడు కలలు కంటారు. కానీ, ప్రముఖ ఓటీటీ వెబ్ సిరీస్ ‘పాతాళ లోక్’ సృష్టికర్త సుదీప్ శర్మ మాత్రం తనకు ఆ ఆసక్తి ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టారు. దానికి గల బలమైన కారణాలను డైరెక్టర్ సుదీప్ శర్మ తాజాగా వివరించారు.

Published on: Feb 19, 2026, 20:00:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఈ పేర్లు వింటేనే వెండితెరపై ఒక మెరుపు కనిపిస్తుంది. వీరిద్దరితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది రచయితలు, దర్శకులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుంటారు. అయితే, ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా ఆలోచించే దర్శకులు కూడా పరిశ్రమలో ఉన్నారు.

షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో సినిమా చేసే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు, నాకు అదే ముఖ్యం.. ఓటీటీ సిరీస్ డైరెక్టర్ కామెంట్స్
షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో సినిమా చేసే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు, నాకు అదే ముఖ్యం.. ఓటీటీ సిరీస్ డైరెక్టర్ కామెంట్స్

సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌లతో

‘పాతాళ లోక్’, ‘కోహ్రా’ వంటి సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత-దర్శకుడు సుదీప్ శర్మ. తాజాగా షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ తనకు ఏమాత్రం లేదని డైరెక్టర్ సుదీప్ శర్మ చెప్పడం షాకింగ్‌గా మారింది. అందుకు గల కారణాలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

“స్టార్ల ఇమేజ్ కంటే కథే ముఖ్యం”

డిజిటల్ కామెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ శర్మ తన మనసులోని మాటను బయటపెట్టారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి సూపర్ స్టార్లతో పనిచేసే కల మీకు కూడా ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు.

“లేదు, నాకు ఎప్పుడూ అలాంటి కోరిక కలగలేదు. అందుకే నేను ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. నేను ఇక్కడికి వచ్చింది ఒక స్టార్‌తో సినిమా చేయడం కోసం కాదు.. నాకు నచ్చిన కథను, నేను చూసి ఇష్టపడిన సినిమాల తరహాలో చెప్పడం కోసం వచ్చాను” అని సుదీప్ శర్మ స్పష్టం చేశారు.

ఆ పని చేయడం చేతకాదు

అంతేకాదు, ఒకవేళ అలాంటి అవకాశం వస్తే భయమేస్తుందని కూడా ఆయన నిజాయతీగా ఒప్పుకున్నారు. “స్టార్లు అంటే వారికి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్‌కు తగ్గట్లుగా మనం కథను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ పని చేయడం నాకు చేతకాదు” అని సుదీప్ శర్మ అన్నారు.

“నేను ఒక పాత్రను రాస్తే.. ఆ పాత్రలో నటుడు ఒదిగిపోవాలి తప్ప, నటుడి కోసం పాత్ర మారకూడదు. ఫ్యాన్స్ ఏమనుకుంటారు? స్టార్‌డమ్ దెబ్బతింటుందా? అనే బాధ్యతలు నాకు వద్దు. సినిమా కంటే స్టార్ గురించే చర్చ ఎక్కువ జరిగే చోట నాకు ఆసక్తి ఉండదు” అని సుదీప్ శర్మ వివరించారు.

సుదీప్ శర్మ నేపథ్యం

ఇదిలా ఉంటే, అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘NH10’ చిత్రంతో సుదీప్ శర్మ రచయితగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గౌరవ హత్యల నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత ‘ఉడ్తా పంజాబ్’, ‘సోన్ చిరియా’ వంటి సినిమాలకు సుదీప్ శర్మ పనిచేశారు. అయితే, ఈ సినిమాలు విమర్శకులను మెప్పించినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

ఓటీటీ వేదికపై

కానీ, ఓటీటీ (OTT) వేదికగా ఆయన సృష్టించిన ‘పాతాళ్ లోక్’, ‘కోహ్రా’ సిరీస్‌లు సుదీప్ శర్మను స్టార్ మేకర్‌గా నిలబెట్టాయి. తాజాగా విడుదలైన ‘కోహ్రా సీజన్ 2’ నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ టాప్-10 లిస్టులోకి చేరి సంచలనం సృష్టించింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

కోహ్రా సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయిన మొదటి వారంలోనే 16 లక్షల మంది వీక్షించడం విశేషం. బరుణ్ సోబ్తీ, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More