చెల్లిని, హీరోయిన్‌ను మెట్లపై నుంచి తోసేసిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్- భయంకరమైన సంఘటన గురించి చెప్పిన సుహానా, షనయా!
స్టార్ కిడ్ షనయ కపూర్ తన చిన్ననాటి భయంకరమైన, సరదా జ్ఞాపకాన్ని తాజాగా పంచుకున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తమను దుప్పటిలో చుట్టి మెట్ల మీద నుంచి కిందకు తోసేసాడన్న షాకింగ్ విషయాన్ని షనయ కపూర్ గుర్తుచేసుకున్నారు. దీంతో షనయ కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ కిడ్స్ మధ్య మంచి స్నేహం ఉంటుంది. అలాగే, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, సీనియర్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయ కపూర్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షనయ కపూర్ చిన్నతనంలో ఆర్యన్ ఖాన్ చేసిన ఒక వింత ప్రయోగం వల్ల తాను, సుహానా ఖాన్ ఎంతలా భయపడ్డారో వివరించారు.

మెట్ల మీద నుంచి రోలర్ కోస్టర్ రైడ్!
షనయ కపూర్ నటించిన తాజా చిత్రం 'తు యా మై' (Tu Ya Main) ప్రమోషన్లలో భాగంగా ఆమె ఒక షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహానా ఖాన్ పంపిన ఒక వాయిస్ నోట్ విని షనయా మురిసిపోయారు.
ఆ వాయిస్ నోట్‌లో సుహానా.. "మనమిద్దరం బ్లాంకెట్‌లో చుట్టబడి మెట్ల మీద నుంచి దొర్లి కిందకు పడిపోయిన రోజు గుర్తుందా? ఎవరో మేధావి (ఆర్యన్) అది గొప్ప ఐడియా అని చెప్పి మనల్ని నెట్టేసారు" అంటూ నవ్వుతూ గుర్తు చేశారు.
దీనిపై షనయా స్పందిస్తూ అసలు విషయం చెప్పారు. "నిజానికి అది ఆర్యన్ ఖాన్ డిజైన్ చేసిన 'రోలర్ కోస్టర్' రైడ్. మేమిద్దరం చిన్నవాళ్లం కావడంతో ఆర్యన్ ఏం చెప్పినా వినేవాళ్లం. 'మీ జీవితంలో ఎక్కడా చూడని రోలర్ కోస్టర్ రైడ్ చూపిస్తా.. హెల్మెట్ పెట్టుకోండి, మిమ్మల్ని దుప్పటిలో చుట్టి జిప్ వేసి మెట్ల మీద నుంచి నెడతాను, గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది' అని ఆర్యన్ మమ్మల్ని నమ్మించాడు" అని షనయా కపూర్ వివరించారు.
ప్రాణాపాయం తప్పింది
ఆర్యన్ మాటలు నమ్మి ఆ రోలర్ కోస్టర్ రైడ్‌కు సిద్ధమైన మా ఇద్దరికి అసలు సినిమా తర్వాత అర్థమైందని షనయా చెప్పారు. "అది అస్సలు మ్యాజిక్ కార్పెట్ రైడ్లా లేదు. మెట్ల మీద నుంచి పడుతుంటే ఒళ్లంతా నొప్పులు పుట్టాయి. అదృష్టవశాత్తూ మాకు పెద్ద గాయాలు కాలేదు కానీ, ఆ రోజు మాత్రం చాలా భయపడ్డాం. ఆర్యన్ ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే ఏడిపించేవాడు" అని షనయా నవ్వుతూ చెప్పుకొచ్చారు.
అనన్య పాండే, నవ్య నవేలి కూడా తమ కుటుంబ సభ్యులతో సమానమని షనయ కపూర్ పేర్కొన్నారు. అలా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన చెల్లి సుహానాను, హీరోయిన్ షనయాను చిన్నప్పుడు మెట్ల పైనుంచి తోసేసి భయపడెలా చేశాడు.
షనయా కొత్త సినిమా 'తూ యా మై'
బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో షనయా కపూర్, ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించిన రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ 'తు యా మై' ఫిబ్రవరి 13న విడుదలైంది. ఒక స్విమ్మింగ్ పూల్‌లో మొసలితో చిక్కుకుపోయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల చుట్టూ తిరిగే సర్వైవల్ థ్రిల్లర్ ఇది.
ఇందులో షనాయా కపూర్ 'అవని' అలియాస్ మిస్ వానిటీగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమాకు కలెక్షన్స్‌తోపాటు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం షనాయా కపూర్ తన నటనతో బాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


