షారుక్ ఖాన్ కింగ్ రిలీజ్ డేట్-బాప్ అంటూ కొడుకు ఆర్యన్ రియాక్షన్-సినిమాలో కూతురు సుహానా కూడా
షారుక్ ఖాన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్' రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. కింగ్ ఏ రోజు థియేటర్లలోకి రానుందో రివీల్ చేశారు. కింగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పై షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ రియాక్షన్ వైరల్ గా మారింది.
ఈ ఏడాది సినీ లవర్స్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన కింగ్ మూవీ ఒకటి. ఇందులో దీపికా పదుకొణే హీరోయిన్. ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ను శనివారం (జనవరి 24) మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనిపై షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ రియాక్షన్ వైరల్ గా మారింది. కింగ్ సినిమాలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తోంది.

కింగ్ రిలీజ్ డేట్
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది! షారుక్ ఖాన్ తదుపరి చిత్రం 'కింగ్' విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. శనివారం.. మేకర్స్ ఒక నిమిషం నిడివి గల అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. కింగ్ రిలీజ్ డేట్ ను డిసెంబర్ 24, 2026గా ప్రకటించారు.
బాప్ అంటూ
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పై రియాక్టయ్యాడు. అతను షారుక్ ఖాన్ యాక్షన్-ప్యాక్డ్, భారీ అవతార్‌లో కనిపించిన అనౌన్స్‌మెంట్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. "బాప్" అని అంటే హిందీలో 'తండ్రి' అని అర్ధం వచ్చేలా క్యాప్షన్‌లో రాశాడు.
కూతురు కూడా
షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేసింది. సుహానా ఈ చిత్రంలో షారుక్ తో పాటు నటిస్తోంది. 'ది ఆర్చీస్' తర్వాత ఆమెకు కింగ్ రెండవ చిత్రంగా నిలుస్తుంది. ఓర్రీ కామెంట్ చేస్తూ.. "సుహానా ఖాన్ కోసం అత్యంత ఉత్సాహంగా ఉన్నాను" అని పేర్కొన్నాడు. శనయ కపూర్, ఖుషీ కపూర్, నవ్య నవేలి నందా హృదయ ఎమోటికాన్‌లతో పోస్ట్‌పై కామెంట్ చేశారు.

ఇంటర్నెట్ బ్రేక్
కరణ్ జోహార్ కూడా ఈ ప్రకటనపై స్పందించాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోను షేర్ చేసి.. "ఓఎమ్‌జిజీజీజీ! ఇంటర్నెట్ బ్రేక్ అయింది! భాయ్ నువ్వు దున్నేశావ్!" అని రాశాడు. కరణ్, షారుక్ కలిసి 'కుచ్ కుచ్ హోతా హై', 'కభీ ఖుషీ కభీ గమ్?', ‘కభీ అల్విదా నా కెహనా’, 'మై నేమ్ ఈజ్ ఖాన్' వంటి సినిమాలకు పనిచేశారు.
కింగ్ గురించి
షారుక్ ఖాన్, దీపికా పదుకొణే లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న మూవీ కింగ్. ఈ చిత్రంలో షారుక్ కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సి, అనిల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ల్పిక్స్ పిక్చర్స్ నిర్మించిన కింగ్ డిసెంబర్ 24, 2026న విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


