బాలీవుడ్ బాద్‌షా బ‌ర్త్‌డే.. షారుక్ ఖాన్ కింగ్ టీజ‌ర్ రిలీజ్‌.. భయాన్ని కాదు విధ్వంసాన్ని అంటూ హ‌డ‌ల్‌.. ఇంట‌ర్నెట్ షేక్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పుట్టిన రోజు ఇవాళ. ఆయన 60వ బర్త్ డే సందర్భంగా కింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేసింది. షారుక్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ టీజర్ అదిరిపోయింది. ఈ టీజర్ సెన్సేషన్ గా మారింది.

Published on: Nov 2, 2025, 13:30:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

షారుక్ ఖాన్ అదరగొట్టే రీఎంట్రీ ఇచ్చారు. ఆదివారం (నవంబర్ 2) షారుక్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కింగ్' సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ లో షారుక్ డార్క్ మోడ్ లో కనిపించారు. ఈ టీజర్ విడుదలైన వెంటనే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

కింగ్ టీజర్ లో షారుక్ ఖాన్
కింగ్ టీజర్ లో షారుక్ ఖాన్

కింగ్ టీజర్

కింగ్ టీజర్ సంచలనంగా మారింది. ఇందులో షారుక్ ఖాన్ సిల్వర్ హెయిర్, నెత్తుటి ముఖంతో విధ్వంసం సృష్టిస్తూ ఒక భయంకరమైన డార్క్ అవతారంలో కనిపించారు. చేతిలో 'కింగ్ ఆఫ్ హార్ట్స్' కార్డు పట్టుకుని దాన్ని కెమెరా వైపు విసురుతూ, ఒళ్లు గగుర్పొడిచేలా డైలాగ్స్ చెప్పారు,

ఎన్ని హత్యలు చేశానో

“కిత్నే ఖూన్ కియే యే యాద్ నహీ. అచ్చే లోగ్ థే యా బురే కభీ పూచా నహీ. బస్ ఉన్కీ ఆంఖో మే ఎహ్‌సాస్ దేఖా, యే ఉన్కీ ఆఖ్రీ సాన్స్ హై. ఔర్ మై ఉస్కీ వజహ్. హజార్ జుర్మ్, 100 దేశో మే బద్నామ్, దునియా నే దియా, సిర్ఫ్ ఏక్ హీ నామ్. డర్ నహీ దెహ్ షత్ హూ. (ఎన్ని హత్యలు చేశానో గుర్తులేదు. వాళ్లు మంచివారో, చెడ్డవారో ఎప్పుడూ అడగలేదు. వాళ్ల కళ్లలో ఒక భావాన్ని మాత్రమే చూశాను. అదే వారి చివరి శ్వాస. దానికి కారణం నేనే. వెయ్యి నేరాలు, వంద దేశాల్లో అపఖ్యాతి, ప్రపంచం నాకు ఒకే ఒక్క పేరు ఇచ్చింది. నేను భయాన్ని కాదు, విధ్వంసాన్ని)” అని షారుక్ డైలాగ్ పేల్చాడు.

యాక్షన్, తీవ్రత, సైకలాజికల్ థ్రిల్‌ను మిళితం చేసి, అభిమానులు మునుపెన్నడూ చూడని సరికొత్త షారక్ ఖాన్‌ను ఈ టీజర్ పరిచయం చేసింది.

బాక్సాఫీస్ బద్దలు

సోషల్ మీడియాలో షారుక్ ఖాన్ అభిమానుల కింగ్ టీజర్ రిలీజ్ కావడంతో హంగామా చేస్తున్నారు. ఒక అభిమాని ఏమో.. “మై లార్డ్… ఆయన తిరిగి వచ్చేశారు, అదీ ఎలా!” అని రాస్తే, మరొకరు “బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం!” అని కామెంట్ చేశారు. సినిమా ఆలస్యమవుతుందన్న పుకార్ల నేపథ్యంలో 2026లో విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొందరు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు వస్తాయని అంచనా వేశారు. “బ్యాంగ్ ఆన్. మరో 1000 కోట్లు లోడింగ్!”, “ఇట్స్ షో టైమ్… 2026 త్వరగా రా” అంటూ పోస్టులు పెట్టారు.

కింగ్ సినిమా గురించి..

కింగ్ సినిమాలో షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయన కుమార్తె సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ, అనిల్ కపూర్ వంటి భారీ తారాగణం ఉంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. షారుక్ చివరి చిత్రం 'జవాన్' (2023) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఆయన జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు. ఇది ఆయన అద్భుతమైన కెరీర్‌లో మరో మైలురాయి. తీవ్రమైన డ్రామా, యాక్షన్‌తో పాటు షారుక్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో 'కింగ్' సినిమా సరికొత్త హద్దులను చెరిపేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More