ఇంటి స్విమ్మింగ్ పూల్‌లోకి మొసలి వస్తే- ఊపిరి బిగబట్టే రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్- భయపెట్టేలా తు యా మై ట్రైలర్

కంటెంట్ క్రియేటర్ల గ్లామర్ ప్రపంచం ఒక మొసలి కోరల మధ్య చిక్కుకుంటే ఎలా ఉంటుందో ‘తు యా మై’ ట్రైలర్ చూపిస్తోంది. బ్యూటిఫుల్ షనాయా కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన తు యా మై రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన తు యా మై ట్రైలర్ భయపెట్టేలా ఉంది.

Published on: Jan 22, 2026, 20:43:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లామర్, క్రేజ్, సోషల్ మీడియా వ్యూస్.. నేటి యువత ప్రపంచమంతా దీని చుట్టూనే తిరుగుతోంది. కానీ, అదే క్రేజ్ ప్రాణాల మీదకు వస్తే? ఇదే పాయింట్‌తో రూపొందిన ‘తు యా మై’ సినిమా ట్రైలర్ గురువారం (జనవరి 22) విడుదలైంది. ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనాయా కపూర్, టాలెంటెడ్ యాక్టర్ ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించారు.

ఇంటి స్విమ్మింగ్ పూల్‌లోకి మొసలి వస్తే- ఊపిరి బిగబట్టే రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్- భయపెట్టేలా తు యా మై ట్రైలర్
ఇంటి స్విమ్మింగ్ పూల్‌లోకి మొసలి వస్తే- ఊపిరి బిగబట్టే రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్- భయపెట్టేలా తు యా మై ట్రైలర్

ఏమిటా కథ?

తు యా మై ట్రైలర్ ప్రారంభం ఓల్డ్ మూవీ ‘ఖూన్ భరీ మాంగ్’ను గుర్తు చేసేలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇందులో షనాయా కపూర్ ‘మిస్ వానిటీ’ అనే గ్లామరస్ కంటెంట్ క్రియేటర్‌గా కనిపిస్తుండగా, ఆదర్శ్ గౌరవ్ నాలాసోపారాకు చెందిన ‘ఏ’ అనే మాస్ క్రియేటర్‌గా నటించారు.

వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వీరిద్దరూ వ్యూస్ కోసం, క్రేజ్ కోసం కలిసి వీడియోలు (కొల్లాబరేషన్స్) చేయడం ప్రారంభిస్తారు. వారి మధ్య కెమిస్ట్రీ, చిలిపి పనులు సరదాగానే సాగిపోతుంటాయి. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ బాగా చూపించారు.

కానీ, ఒక అడ్వెంచర్ వీడియో షూట్ కోసం వెళ్లినప్పుడు వీరి జీవితం తలకిందులవుతుంది. ఒక పాడుబడ్డ ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లో వీరు చిక్కుకుపోతారు. అక్కడ వీరికి ఎదురైంది సామాన్యమైన శత్రువు కాదు.. మనుషుల రక్తం కోసం వేచి చూస్తున్న ఒక భారీ మొసలి. ఆ మొసలి బారి నుంచి ప్రాణాలతో బయటపడటానికి వారు చేసే పోరాటమే తు యా మై.

ట్రైలర్ హైలైట్స్

మూడు నిమిషాల నిడివి ఉన్న తు యా మై ట్రైలర్‌లో షనాయా కపూర్ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా మొసలి ఆమెను లాక్కెళ్లేటప్పుడు ఆమె పలికించిన హావభావాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

లోతైన టన్నెల్స్ (సొరంగాలు), రక్తంతో తడిసిన పూల్, చీకటి గదులు.. ఇలా ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠను పెంచుతోంది. తు యా మై ట్రైలర్ చివరలో మొసలి ఒక శరీరాన్ని అడవిలోకి లాక్కెళ్లడం చూస్తుంటే, సినిమాలో భారీ ట్విస్టులు ఉన్నాయని అర్థమవుతోంది.

నెటిజన్ల రియాక్షన్

ఈ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ తు యా మై ట్రైలర్ ఊపిరి బిగబట్టి చూసేలా చేసింది. భయపెడుతున్న తు యా మై ట్రైలర్‌కు విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది.

“షనాయా కపూర్ నుంచి ఇలాంటి నటన ఊహించలేదు, చాలా ఇంపాక్ట్‌గా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా, “ఆ మొసలికి కళ్లు కనిపించవు, అది కేవలం శబ్దాన్ని బట్టి అటాక్ చేస్తుంది.. అదే ఇందులో అసలైన ట్విస్ట్ కావొచ్చు” అని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

సినిమా విశేషాలు

ప్రముఖ రొమాంటిక్ సినిమాల దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన తు యా మై సినిమా ఫిబ్రవరి 13న వాలంటైన్స్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బ్యాంకాక్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను చిత్రీకరించారు. కంటెంట్ క్రియేటర్ల సంస్కృతిని, ప్రేమని, ప్రాణసంకట స్థితిని కలగలిపి దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచినట్లు తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More