కథ విన్నప్పుడు ఒకటి, తీశాక ఇంకోటీ- బాలీవుడ్ స్టార్ హీరో మూవీపై రష్మిక మందన్నా షాకింగ్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మకి మందన్నా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో జోడీగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా సికందర్. అయితే, సికందర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరా పరాజయం పాలైంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటించిన ‘సికందర్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా వైఫల్యంపై స్పందించిన రష్మిక.. తనకు చెప్పిన కథకు, తెరపైకి వచ్చిన సినిమాకు చాలా తేడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ స్టార్ హీరోతో
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన చిత్రం ‘సికందర్’. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య గతేడాది సంక్రాంతి బరిలో నిలిచింది.
అయితే, బలహీనమైన కథనం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ లోపించడంతో సికందర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. తాజాగా సికందర్ పరాజయంపై రష్మిక మందన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
కథ మారింది.. రష్మిక ఆవేదన
తెలుగు సీనియర్ జర్నలిస్ట్ ప్రేమకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా‘సికందర్’ గురించి మనసు విప్పారు. "నేను మురుగదాస్ గారి దగ్గర కథ విన్నప్పుడు అది చాలా భిన్నంగా ఉంది. కానీ, షూటింగ్ జరుగుతున్న కొద్దీ పరిస్థితులు మారిపోయాయి. సాధారణంగా సినిమాల్లో ఇది జరుగుతూనే ఉంటుంది. మనం విన్న కథ ఒకటి అయితే.. ఎడిటింగ్, పర్ఫార్మెన్స్, సినిమా విడుదల సమయానికి అనుగుణంగా కథలో మార్పులు చేస్తారు. సికందర్ విషయంలోనూ అదే జరిగింది" అని రష్మిక చెప్పుకొచ్చారు.
నిజానికి సినిమాలో రష్మిక మందన్నా పాత్ర నిడివిని ఎడిటింగ్‌లో బాగా తగ్గించేశారని, అందుకే ఆమె పాత్ర అంతంతమాత్రంగానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ.. "సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా తండ్రీకూతుళ్లలా కనిపిస్తున్నారు తప్ప జంటలా లేరు. అసలు ఎడిటింగ్ వల్ల కథలో అర్థం పర్థం లేకుండా పోయింది" అని విమర్శించారు.
వసూళ్లలో వెనుకబడిన ‘సికందర్’
దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన సికందర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 185 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. సల్మాన్ ఖాన్ క్రేజ్‌కు ఇది చాలా తక్కువ మొత్తం. సెన్సార్ కట్స్ తర్వాత సుమారు 20 నిమిషాల నిడివిని తగ్గించడం కూడా సినిమాకు మైనస్‌గా మారిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
సల్మాన్ ఖాన్ రియాక్షన్ ఏంటి?
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 19వ సీజన్‌లో సల్మాన్ ఖాన్ ఈ సినిమా గురించి ఆసక్తికరంగా స్పందించారు. తనకు నచ్చకుండా చేసిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అని అడిగినప్పుడు సికందర్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"నేను చేసిన సినిమాల్లో నాకు సూర్యవంశీ, నిశ్చయ్ వంటి పాత సినిమాలు నచ్చవు. కానీ 'సికందర్' గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అది డిజాస్టర్ అని వారు అనుకోవచ్చు కానీ, నేను మాత్రం అలా నమ్మను. ఆ సినిమా ప్లాట్ (కథాంశం) నాకు చాలా నచ్చింది" అని సల్మాన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈద్ నాటికే రిలీజ్ చేయాలని
కాగా, సల్మాన్ తన ఆరోగ్యం బాగోలేకపోయినా సికందర్ సినిమాను ఈద్ (Eid) నాటికే విడుదల చేయాలని పట్టుబట్టడం కూడా ఫలితంపై ప్రభావం చూపిందని ఇండస్ట్రీ టాక్. ఇక సినిమాలో సత్యరాజ్, కాజల్ అగర్వాల్ కూడా నటించినప్పటికీ వారి పాత్రలు కూడా నామమాత్రంగానే ఉండిపోయాయని టాక్ వినిపించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


