హిందువులు మేల్కోవాలి అంటున్న కాజల్ అగర్వాల్.. మౌనం మిమ్మల్ని కాపాడదంటూ చేసిన పోస్ట్ వైరల్

నటి కాజల్ అగర్వాల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్ లో హిందూ మతానికి చెందిన వ్యక్తిని కొట్టి చంపడంపై స్పందించిన ఆమె.. హిందువులు మేల్కోవాలని పిలుపునివ్వడం గమనార్హం.

Published on: Dec 27, 2025, 13:46:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగ్లాదేశ్ లోని మైమెన్‌సింగ్‌లో రీసెంట్ గా దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని మూకదాడిలో దారుణంగా చంపేసిన ఘటన ఇప్పుడు మన దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ అమానుషమైన చర్యపై స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

హిందువులు మేల్కోవాలి అంటున్న కాజల్ అగర్వాల్.. మౌనం మిమ్మల్ని కాపాడదంటూ చేసిన పోస్ట్ వైరల్
హిందువులు మేల్కోవాలి అంటున్న కాజల్ అగర్వాల్.. మౌనం మిమ్మల్ని కాపాడదంటూ చేసిన పోస్ట్ వైరల్

కాజల్ అగర్వాల్ పోస్ట్ వైరల్

బంగ్లాదేశ్ లో మూకదాడిపై ఇండియాలో సెలబ్రిటీలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఈ మధ్యే జాన్వీ కపూర్ దీనిపై మాట్లాడగా.. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఓ పోస్ట్ చేసింది. "హిందువులారా మేల్కోండి" అంటూ కాజల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సీరియస్ మెసేజ్ పోస్ట్ చేసింది.

మంటల్లో కాలుతున్న ఒక వ్యక్తి బొమ్మతో ఉన్న పోస్టర్ ని షేర్ చేస్తూ.. "హిందువులారా మేల్కోండి! మీ మౌనం మిమ్మల్ని కాపాడదు" అని ఘాటుగా రాసుకొచ్చింది. బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణ కోసం అందరూ గొంతు ఎత్తాలని పిలుపునిచ్చింది.

జాన్వీ కపూర్ రియాక్షన్ ఇలా..

ఇంతకు ముందే జాన్వీ కపూర్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఘటనపై స్పందించింది. ఈ ఘటనను పూర్తి అనాగరికంగా అభివర్ణించింది. ఇది ఊచకోత అని మండిపడింది. మనవాళ్ళు చేసే తప్పును ఎత్తిచూపింది.

"ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలకు మనం కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ మన పక్కనే మన సోదర సమానులను చంపుతుంటే పట్టించుకోం. ఇలాంటి హిపోక్రసీ (కపట వేషం) మనల్ని నాశనం చేస్తుంది" అని గట్టిగా క్లాస్ పీకింది. ఈ వీడియోలు చూశాక కూడా రక్తం మరిగిపోకపోతే అది మన తప్పు అని సీరియస్ అయ్యింది.

అసలేం జరిగిందంటే?

బంగ్లాదేశ్ లో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడిని కొంతమంది మూకలు పబ్లిక్ గా చంపేశారు. ఈ ఘటన తర్వాత ఇండియాలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య దౌత్యపరంగా కూడా హీట్ పెరిగింది. వీసా సర్వీసులను కూడా తాత్కాలికంగా ఆపేశారు. అయతే మన హీరోయిన్లు కూడా ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మీద గట్టిగా గొంతు విప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More