మన అన్నచెల్లెళ్లని కాల్చి చంపుతున్నారు.. మీకు ఆవేశం రావడం లేదా.. ప్రశ్నించరా?: జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
జాన్వీ కపూర్ గురువారం (డిసెంబర్ 25) చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌లో జరిగిన దీపు చంద్ర దాస్ హత్యపై ఆమె స్పందిస్తూ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేసింది. ఇది మీకు కనిపించడం లేదా.. ఆవేశం రావడం లేదా అంటూ ఆమె ప్రశ్నించడం గమనార్హం.
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘోరాన్ని ఆమె మారణకాండగా అభివర్ణిస్తూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ మొత్తం మౌనంగా ఉన్న వేళ.. జాన్వీ ధైర్యంగా స్పందించడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

మీకు ఆవేశం రావడం లేదా?
బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌లో 27 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను ఒక మూక దారుణంగా హత్య చేసిన ఘటనపై జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రూపంలో ఉన్నా సరే అతివాదాన్ని ఖండించాల్సిందేనని ఆమె పిలుపునిచ్చింది. గురువారం (డిసెంబర్ 25) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "దీపు చంద్ర దాస్" అనే టైటిల్‌తో జాన్వీ ఒక నోట్ రాసుకొచ్చింది.
"బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అనాగరికం. ఇది కేవలం ఒక సంఘటన కాదు.. ఇదొక మారణకాండ. ఆయన్ని నడిరోడ్డుపై అంత దారుణంగా చంపి తగలబెట్టారు. ఆ వీడియోలు చూసి, ఆ వార్తలు చదివి, ప్రశ్నలు అడిగాక కూడా.. మీకు ఆవేశం రాకపోతే.. మనలోని ఆ ద్వంద్వ వైఖరే మనకు తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాల గురించి మనం బాధపడతాం.. ఏడుస్తాం. కానీ మన పక్కనే మన సోదరసోదరీమణులను సజీవ దహనం చేస్తుంటే పట్టించుకోమా? మనం మన మానవత్వాన్ని మర్చిపోకముందే.. ఏ రూపంలో ఉన్నా సరే అతివాదాన్ని గట్టిగా ఖండించాల్సిందే" అని జాన్వీ స్పష్టం చేసింది.
ఆమెకు గట్స్ ఉన్నాయంటూ నెటిజన్ల ప్రశంసలు
జాన్వీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా రెడిట్ లో వైరల్ అవుతోంది. "మార్కెట్ పోతుందనో, ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనో భయపడి మిగతా బాలీవుడ్ స్టార్స్ మౌనంగా ఉంటే.. జాన్వీ మాత్రం ఇస్లామిక్ ఎక్స్‌ట్రీమిజం గురించి ధైర్యంగా మాట్లాడింది. సెలెక్టివ్ హిపోక్రసీ లేకుండా రియాక్ట్ అయ్యింది" అని ఒక నెటిజన్ రాశారు.
మరొకరు స్పందిస్తూ.. "నటిగా ఆమె నాకు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ సమాజంలో ఏం జరుగుతుందో ఆమెకు అవగాహన ఉంది. మిగతా స్టార్ కిడ్స్ లా కాకుండా.. ఆమెకు నిజాలు మాట్లాడే దమ్ముంది" అని మెచ్చుకున్నారు.
అసలేం జరిగింది?
కొన్ని రోజుల కిందట బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్, భాలుకా ప్రాంతంలో దీపు చంద్ర దాస్ అనే గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడిని ఒక మూక దారుణంగా కొట్టి చంపింది. దైవదూషణ చేశాడనే ఆరోపణతో.. ఆయన్ని చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు.
ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారానే తమ కొడుకు చనిపోయిన విషయం తెలిసిందని దీపు తండ్రి రవిలాల్ దాస్ వాపోయారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


