OTT Horror: విశ్వక్ సేన్‌ను కలలో కూడా వెంటాడిన ఓటీటీ హారర్ థ్రిల్లర్-ఎవరికైనా జరగొచ్చు అంటూ-96 శాతం ఫ్రెష్, 7.8 రేటింగ్!

Vishwak Sen Liked OTT Horror Thriller Series: మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు విపరీతంగా నచ్చిన ఓటీటీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉంది. ఆ సిరీస్ చూసినప్పటి నుంచి నిద్ర పట్టేది కాదని, కలలో కూడా వెంటాడేదేన్నట్లుగా చెప్పాడు విశ్వక్ సేన్. మరి ఆ ఓటీటీ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 10, 2026, 09:20:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ చవిచూశాడు. ఈసారి ఎలాగైన మంచి హిట్ కొట్టాలన్న కాన్ఫిడెన్స్‌తో రూట్ మార్చి కామెడీ ట్రాక్‌లోకి వచ్చేశాడు విశ్వక్ సేన్. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫంకీ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా చేశాడు.

విశ్వక్ సేన్‌ను కలలో కూడా వెంటాడిన ఓటీటీ హారర్ థ్రిల్లర్-ఎవరికైనా జరగొచ్చు అంటూ-96 శాతం ఫ్రెష్, 7.8 రేటింగ్!
విశ్వక్ సేన్‌ను కలలో కూడా వెంటాడిన ఓటీటీ హారర్ థ్రిల్లర్-ఎవరికైనా జరగొచ్చు అంటూ-96 శాతం ఫ్రెష్, 7.8 రేటింగ్!

కయాదు లోహర్ క్రేజ్

ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా బ్యూటిపుల్ కయాదు లోహర్ హీరోయిన్‌గా చేసింది. తమిళం, మలయాళం సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కయాదు లోహర్ డ్రాగెన్ మూవీతో తెలుగులోనూ మంచి పాపులారిటీ అందుకుంది.

డైరెక్టర్‌గా విశ్వక్ సేన్, నిర్మాతగా కయాదు లోహర్ నటించిన ఫంకీ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్‌గా ఫంకీ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఫంకీ కోసం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మూవీ టీమ్.

ఓటీటీ సిరీస్

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫంకీ హీరో హీరోయిన్ విశ్వక్ సేన్, కయాదు లోహర్ పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో బాగా నచ్చిన ఓటీటీ సిరీస్‌కు సంబంధించి యాంకర్ ఓ ప్రశ్న అడిగాడు. దానికి విశ్వక్ సేన్ ఇచ్చిన ఆన్సర్, ఆ ఓటీటీ సిరీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "వాచ్ 'ఫ్రమ్'.. గో వాచ్ 'ఫ్రమ్'. నీకు తెల్వదు.. నాకు కొన్ని రోజులు నిద్ర రాలే. నిద్ర పోతున్నా కలలో కూడా అదే వస్తుంది. ఇదేందీ నిద్ర వస్తలేదని లేచి మళ్లీ ఇంకొక ఎపిసోడ్ చూస్తున్నా" అని విశ్వక్ సేన్ తనను కలలో కూడా వెంటాడిన ఓటీటీ సిరీస్ గురించి తెలిపాడు.

ఇంత క్రేజీగా ఉందేంటీ

విశ్వక్ సేన్ అలా చెప్పడంతో.. "అది ఐడియా చెప్పాడు మా ఫ్రెండ్.. నెరేట్ చేస్తే ఏంట్రీ ఇంతా క్రేజీగా ఉంది అనిపించింది" అని యాంకర్ అన్నారు. "విచిత్రమైన సంఘటనలు ఎప్పుడైనా ఎవరికైనా జరగొచ్చు" అని విశ్వక్ సేన్ అన్నాడు.

"కదా.. ఒక ఊరికెళ్లి" అని యాంకర్ అంటుంటే.. "అంటే, పోయిన తర్వాత రోడ్‌లో ప్రతిసారి అదే వస్తుంది. వెనక్కి తిప్పిన అదే.. చూడండి" అని విశ్వక్ సేన్ వివరించాడు. విశ్వక్ సేన్ సజ్జెస్ట్ చేసిన ఓటీటీ సిరీస్ పేరు ఫ్రమ్. ఇది ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.

లూప్‌లో చిక్కుకుని

ఓ ఫ్యామిలీ ఓ సిటీని దాటుతూ వెళ్తారు. కానీ, ఎంత దూరం వెళ్లిన వచ్చిన ఇల్లే రావడం, చూసిన ప్రజలే, చెట్లు, రోడ్లు కనిపిస్తుంటాయి. వాళ్లంతా ఒక లూప్‌లో చిక్కుకుపోతారు. వీళ్లతోపాటు అక్కడ చాలా మంది మనుషులు కూడా ఉంటారు. వారంతా చేసేది లేక అక్కడే జీవనం సాగిస్తారు.

కానీ, రాత్రి అయితే మాత్రం ఇంటికున్న కిటికీలు, తలుపులు మూసేసి డోర్ కర్టన్స్ వేసి పడుకోవాలి. అలా చేయకుంటే ఏం జరుగుతుందనేదే మిగతా ఫ్రమ్ ఓటీటీ సిరీస్ స్టోరీ. డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కిన ఫ్రమ్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో పదికి 7.8 రేటింగ్ ఉంది.

అమెజాన్ ప్రైమ్‌లో

అంతేకాకుండా 96 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా రొట్టెన్ టొమాటోస్ నుంచి సర్టిఫికేట్ సాధించింది ఫ్రమ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రమ్ ఓటీటీ రిలీజ్ అయింది. మొత్తంగా 3 సీజన్లు 30 ఎపిసోడ్స్‌తో ఫ్రమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More