Sreeleela: బుల్లితెరపై శ్రీలీల సందడి- కుర్చీ మడతపెట్టి పాటకు స్టెప్పులు- రోజా, శేఖర్ మాస్టర్ మధ్య పోటీ-ఉగాది స్పెషల్‌గా!
Ugadi Ki Vasthunnam Sandadi Thesthunnam Zee Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్ శ్రీలీల కుర్చీ మడతపెట్టి పాటకు స్టెప్పులేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. ఉగాది స్పెషల్‌గా జీ తెలుగులో ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం ప్రోగ్రామ్‌లో ఆమెతోపాటు నిఖిల్, సంయుక్త మీనన్ సందడి చేయనున్నారు.
ఆకట్టుకునే సీరియల్స్, అలరించే రియాల్టీ షోలతో అలరిస్తున్న జీ తెలుగు ఛానెల్ ఈ ఉగాదికి బుల్లితెర ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకు మరో ప్రత్యేక కార్యక్రమంతో వచ్చేస్తోంది.

నూతన సంవత్సరాదికి
పండుగలు, ప్రత్యేక సందర్భాలను వినోదభరిత కార్యక్రమాలతో ప్రత్యేకంగా మారుస్తున్న జీ తెలుగు ఈ తెలుగు నూతన సంవత్సరాది ఉగాదికి మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. సంస్కృతి, సంప్రదాయం మేళవించిన ఘనమైన వేడుక.. వెండితెర, బుల్లితెర తారల సందడితో సరదాగా సాగిన సంబరంగా ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం అనే పోగ్రామ్ ప్రసారం కానుంది.
ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం
జీ తెలుగులో మార్చి 19 గురువారం ఉదయం 10 గంటలకు ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం కార్యక్రమం ప్రీమియర్ కానుంది. నూతన సంవత్సరాది ఉగాది పండగని జీ తెలుగు నటీనటులందరూ ఘనంగా జరుపుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్ రవి వ్యాఖ్యాతగా నిర్వహించనున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్
వెండితెర, బుల్లితెర తారలతో ఘనంగా సాగనున్న ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ పాల్గొని సందడి చేయనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హీరోయిన్, యంగ్ బ్యూటీ శ్రీలీల గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి..’ స్టెప్‌తో అందరినీ అలరించనుంది. అంతేకాదు, స్వయంభూ సినిమా టీమ్ నుంచి హీరో నిఖిల్, సంయుక్త మీనన్, నభా నటేష్ కూడా సందడి చేశారు.
రోజా, శేఖర్ మాస్టర్ మధ్య పోటీ
అద్భుతమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలతో సాగనున్న ఈ ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం కార్యక్రమంలో ఉగాది పచ్చడి చేయడంతో పాటు, ‘ఎవరి గొంతు బలమైనదో’ తేల్చుకునేందుకు ప్రముఖ నటి రోజా, డాన్స్ మాస్టర్ శేఖర్ ఇద్దరూ రెండు టీమ్స్ పోటీ పడనున్నారు.
డబ్బింగ్ ఆర్టిస్టులకు సన్మానం
ఈ పోటీలో అమ్మాయిలు రోజాని, అబ్బాయిలు శేఖర్ మాస్టర్ని సపోర్ట్ చేయనున్నారు. ఉగాది సందర్భంగా సీరియల్ డబ్బింగ్ ఆర్టిస్టులకు వారు వాయిస్ ఇచ్చే నటీనటుల చేతుల మీదుగా సన్మానం జరగనుంది.
జీ తెలుగులో చూడండి అంటూ
ఆటలు, పాటలు, అల్లరి, అద్భుత ప్రదర్శనలు, సరదా సంబరాలతో సాగిన ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమం ఉగాదికి వస్తున్నాం సరదా తెస్తున్నం షోని జీ తెలుగు వేదికగా తప్పక చూడండి అంటూ నిర్వాహకులు అనౌన్స్ చేశారు.
జీ తెలుగు పాపులర్ సీరియల్స్
జీ తెలుగులో ఇలాంటి షోలతోపాటు రోజు ప్రసారం అయ్యే సీరియల్స్ తెలుగు రాష్ట్రాల బుల్లితెర ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటాయి. జీ తెలుగులో నిండు నూరేళ్ల సావాసం, త్రినయని, జగధాత్రి, పడమటి సంధ్యారాగం, మేఘసందేశం, గుండమ్మ కథ తదితర సీరియల్స్ చాలా పాపులర్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


