బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా వెంకట్రామయ్య గారి తాలూకా- సురేష్ బాబుతో టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సినిమా వెంకట్రామయ్య గారి తాలూకా. ఈ మూవీలో సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, నటి సుధ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, సీనియర్ నటి సుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ‘జయమ్మ పంచాయతీ’ మూవీ ఫేమ్ దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ (బుల్లితెర మెగాస్టార్) కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా నటించారు.

సతీష్ ఆవాల డైరెక్టర్‌గా
తండ్రి, పిల్లల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో వారి వారి బాధ్యతలను తెలియజేసేలా రూపొందిన ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ప్రధానంగా ఫాదర్ సెంటిమెంట్
ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే క్యూట్ లవ్‌స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుంది. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు యనమదల కాశీ విశ్వనాథ్, మిర్చి మాధవి, జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఇక్బాల్, జీవన ప్రియ, గౌరీ నాయుడు, హరీష్ టెక్కలి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు.
వెంకట్రామయ్య గారి తాలూకా టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్
తాజాగా వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. టైటిల్ చాలా బాగుందని, సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.
ఆత్మతో చేసిన సినిమా
ఈ సందర్భంగా సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో వెంకట్రామయ్య గారు పాత్రను నేను పోషించా. నేను మనసు పెట్టి ఆత్మతో చేసిన సినిమా ఇది. ఇందులో చాలా గొప్ప థీమ్ ఉంది. అలాగే మంచి సందేశం ఉంది. తల్లిదండ్రుల ఆవేదన, పిల్లల బాధ్యతను చెప్పే సినిమా ఇది. గొప్ప కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది" అని చెప్పారు.
ఆయన చాలా లక్కీ హ్యాండ్
సీనియర్ నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సురేష్ బాబుగారు లాంచ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా లక్కీ హ్యాండ్. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


