డబ్బు విషయాలు మీకెందుకు.. సినిమా చూస్తే చాలు కదా: అఖండ 2 రిలీజ్ వాయిదాపై నిర్మాత సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా పడటంపై నిర్మాత సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్థిక విషయాలు పబ్లిగ్గా మాట్లాడాల్సిన అవసరం లేదని, ఆడియెన్స్ సినిమా చూస్తే చాలు కదా అని అతడు అనడం విశేషం.

Published on: Dec 5, 2025, 14:42:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా స్పందించాడు. సైక్ సిద్ధార్థ మూవీకి ప్రెజెంటర్ గా ఉన్న అతడు.. ప్రెస్ మీట్ లో వివిధ అంశాలపై మాట్లాడాడు. అఖండ 2 ఇష్యూ త్వరలోనే పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు.

డబ్బు విషయాలు మీకెందుకు.. సినిమా చూస్తే చాలు కదా: అఖండ 2 రిలీజ్ వాయిదాపై నిర్మాత సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డబ్బు విషయాలు మీకెందుకు.. సినిమా చూస్తే చాలు కదా: అఖండ 2 రిలీజ్ వాయిదాపై నిర్మాత సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అఖండ 2పై సురేష్ బాబు ఏమన్నాడంటే?

సైక్ సిద్ధార్థ మూవీ ప్రమోషన్లలో భాగంగా మూవీ సమర్పకుడిగా ఉన్న సురేష్ బాబు శుక్రవారం (డిసెంబర్ 5) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అఖండ 2 రిలీజ్ వాయిదా గురించి రిపోర్టర్లు అతన్ని ప్రశ్నించారు. దీనిపై సురేష్ బాబు స్పందిస్తూ.. ఆర్థిక విషయాలు పబ్లిగ్గా చర్చించాల్సిన అవసరం లేదని అన్నాడు.

“ఆ విషయం గురించి మాట్లాడటం వల్లే రావడం ఆలస్యమైంది. అది పరిష్కారమవుతుంది. అయినా అవన్నీ ఆర్థిక విషయాలు. వాటి గురించి పబ్లిగ్గా మాట్లాడకూడదు. దురదృష్టవశాత్తూ వ్యాపార విషయాలు మరీ ఎక్కువగా జనాల్లోకి వెళ్తున్నాయి. ప్రతి ఒక్కడూ ఇలా అయిందంట.. ఇన్ని డబ్బులంట అని మాట్లాడుతున్నారు. ఆడియెన్స్ సినిమా చూస్తే చాలు. వాళ్లకు ఇవన్నీ ఎందుకు ఇవ్వడం. ఆర్థిక సమస్యలు ఉంటాయి. గతంలోనూ ఉన్నాయి. ముందే ప్లాన్ చేసుకుంటే సమసిపోతాయి. ఇది కూడా పరిష్కారమవతుంది” అని సురేష్ బాబు అన్నాడు.

అఖండ 2 రిలీజ్ వాయిదా ఎందుకంటే?

గురువారం నాడు ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తమకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో మద్రాస్ హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ (నిలుపుదల ఉత్తర్వులు) తెచ్చుకున్నట్లు వెల్లడించింది.

ఎరోస్ సంస్థకు 14 రీల్స్ దాదాపు రూ. 28 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. ఈ బకాయిలు చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను విడుదల చేయడం, పంపిణీ చేయడం లేదా వాణిజ్యపరంగా వాడుకోవడం కుదరదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్టు కేసు కారణంగానే చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More