Sreeleela: రంగస్థలం మహేష్‌పై శ్రీలీల సీరియస్ లుక్- ఫోన్, అసభ్య ప్రవర్తనే కారణం?- ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ వీడియో వైరల్!

Sreeleela Serious On Actor Mahesh Achanta: పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల, కమెడియన్, నటుడు, రంగస్థలం మహేష్ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా శ్రీలీల కోపానికి కారణాలు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది.

Published on: Mar 16, 2026, 16:02:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సినిమా విశేషాల కంటే కూడా వేదికపై హీరోయిన్ శ్రీలీల, నటుడు మహేష్ ఆచంట (రంగస్థలం మహేష్) మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.

రంగస్థలం మహేష్‌పై శ్రీలీల సీరియస్ లుక్- ఫోన్, అసభ్య ప్రవర్తనే కారణం?- ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ వీడియో వైరల్!
రంగస్థలం మహేష్‌పై శ్రీలీల సీరియస్ లుక్- ఫోన్, అసభ్య ప్రవర్తనే కారణం?- ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ వీడియో వైరల్!

అసలేం జరిగింది?

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ స్పీచ్ ఇస్తుండగా అంతా ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారు. అదే సమయంలో శ్రీలీల ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన వెనుక నిలబడిన మహేష్ ఆచంట వైపు చాలా సీరియస్‌గా చూసింది.

ఆ చూపులకు మహేష్ మొదట నవ్వుతూ స్పందించినప్పటికీ, శ్రీలీల కోపాన్ని చూసి వెంటనే మౌనంగా ఉండిపోయారు. అక్కడ మాటల యుద్ధం జరగకపోయినా, శ్రీలీల బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆమె ఏదో విషయంలో తీవ్ర అసహనానికి లోనైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఫోన్ గోలే కారణమా?

నెటిజన్ల విశ్లేషణ ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో మహేష్ ఆచంట మొబైల్ ఫోన్ పెద్దగా రింగ్ అవ్వడమే శ్రీలీల ఆగ్రహానికి కారణమని కొంతమంది అంటున్నారు.

పవన్ మాట్లాడుతుండగా డిస్టర్బెన్స్ కలగడంతో శ్రీలీల వాల్యూమ్ తగ్గించమని అతడిని హెచ్చరించినట్లు చెబుతున్నారు. అయితే, దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. శ్రీలీల తన ఫోన్‌ను మహేష్‌కు ఇచ్చిందని, అది చెక్ చేసుకోవడానికే ఆమె వెనక్కి తిరిగిందని మరికొందరు అంటున్నారు.

ఒక్క డైలాగ్ లేకుండా

రంగస్థలం మహేష్ అసభ్యగం ప్రవర్తించడంతోనే శ్రీలీల అలా సీరియస్‌గా చూసిందని మరికొంతమంది నెటిజన్స్ చెబుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల, రంగస్థలం మహేష్ మధ్య ఒక్క డైలాగ్ లేకుండా జరిగిన సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల చర్చకు దారి తీసింది.

ఏది ఏమైనా, ఆ సమయంలో మహేష్ కూడా తను ఏం తప్పు చేశానో అర్థం కానట్లు అమాయకమైన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం వీడియోలో చూడవచ్చు. శ్రీలీల ప్రవర్తనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో భిన్న స్వరాలు

"మాటలతో రచ్చ చేయకుండా తన చూపులతోనే సైలెంట్‌గా మందలించడం ఆమె క్లాస్‌కు నిదర్శనం" అని కొందరు శ్రీలీలకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు మాత్రం ఆమెది 'అహంకారం' (Attitude) అని విమర్శిస్తున్నారు. "ఆమె నోటితో ఏమీ అనలేదు కానీ, ఆ చూపుల్లో చాలా అహంకారం కనిపిస్తోంది.. మీడియా ఆమెను అనవసరంగా వెనకేసుకొస్తోంది" అని ఒక యూజర్ విమర్శించారు.

శ్రీలీల చిన్నచూపు వివాదం

ఇదిలా ఉంటే, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న తరుణంలో ఈ 'శ్రీలీల చిన్న చూపు' వివాదం సినిమాకు ఏ మేరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More