Raashi Khanna On War: యుద్ధం ముదిరితే సినిమాలకు కష్టమే, ఓటీటీలు మరింత శక్తివంతంగా మారతాయి.. రాశీ ఖన్నా విశ్లేషణ!

Raashi Khanna About War Impact And OTT Movies: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు సినీ పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల పెరిగే ధరలు, ఆర్థిక ఇబ్బందులు ఓటీటీలను మరింత శక్తివంతంగా మారుస్తాయని విశ్లేషించారు.

Mar 15, 2026, 20:12:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

యుద్ధం ముదిరితే సినిమాలకు కష్టమే, ఓటీటీలు మరింత శక్తివంతంగా మారతాయి.. రాశీ ఖన్నా విశ్లేషణ!
యుద్ధం ముదిరితే సినిమాలకు కష్టమే, ఓటీటీలు మరింత శక్తివంతంగా మారతాయి.. రాశీ ఖన్నా విశ్లేషణ!

అయితే, రాశీ ఖన్నా కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, యుద్ధం వంటి విషయాలు సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై చాలా లోతైన విశ్లేషణ చేశారు.

యుద్ధం-ద్రవ్యోల్బణం: రాశీ ఖన్నా ఆందోళన

అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. "మనం ఒక యుద్ధ కాలంలో ఉన్నాం. దీనివల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఎంత దారుణంగా ఉండబోతుందో చాలామంది గ్రహించడం లేదు" అని తెలిపారు.

"నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని, కాబట్టి నాకు తెలుసు.. సామాన్యుడికి సినిమా అనేది ఒక లగ్జరీ. చేతిలో డబ్బులు లేనప్పుడు, తన ప్రాధాన్యతల్లో సినిమా మొదటి స్థానంలో ఉండదు" అని రాశీ ఖన్నా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

థియేటర్ల భవిష్యత్తుపై ప్రశ్నలు

ప్రస్తుతం ప్రేక్షకులు కేవలం భారీ బడ్జెట్ సినిమాల కోసమే థియేటర్లకు వస్తున్నారని, చిన్న, మధ్యతరహా సినిమాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాశీ ఖన్నా అభిప్రాయపడ్డారు.

"యుద్ధం ముదిరి ధరలు పెరిగి, ఆర్థిక ఇబ్బందులు వస్తే థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య మరింత తగ్గుతుంది. అప్పుడు ఓటీటీలు మరింత శక్తివంతంగా మారతాయి. ఇదే మన భవిష్యత్తు కాబోతోంది" అని రాశీ ఖన్నా పేర్కొన్నారు.

పరిశ్రమలో ఇప్పటికే మొదలైన మార్పులు

యుద్ధం, ఇంధన కొరత ప్రభావం ఇప్పటికే బెంగాలీ, మలయాళ చిత్ర పరిశ్రమలపై పడింది. ఎల్‌పీజీ గ్యాస్ కొరత వల్ల అవుట్‌డోర్ షూటింగుల్లో వంట కోసం కట్టెలు లేదా ఇండక్షన్ స్టవ్‌లను వాడుతున్నారనే వార్తలు సినిమా బడ్జెట్లపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మార్చి 19న బాక్సాఫీస్ ఫైట్

ఇదిలా ఉంటే, రాశీ ఖన్నా ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘తెలుసు కదా’, ‘120 బహదూర్’ వంటి చిత్రాలతో అలరించిన రాశీ ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్, శ్రీలీలతో కలిసి రాశీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. అదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధరందర్: ది రివెంజ్’ కూడా రిలీజ్ కానుంది. దీంతో ఆరోజున బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున 4 గంటలకే ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షోలు పడనుండటంతో మెగా ఫ్యాన్స్‌లో సందడి నెలకొంది.

ఓటీటీ సినిమాలు, సిరీస్‌లతో

వీటితో పాటు ‘ఫర్జీ 2’, ‘తలాఖోన్ మే ఏక్’ వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో రాశీ ఖన్నా తన సత్తా చాటుతోంది. యుద్ధ నీడలు ఉన్నప్పటికీ, తన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More