OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 250 కోట్ల శ్రీలీల తమిళ సినిమా- విలన్‌గా స్టార్ హీరో- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడంటే?
Today OTT Release Movie: ఓటీటీలోకి ఇవాళ రూ. 250 కోట్ల తమిళ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా పరాశక్తి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ శ్రీలీల నటించింది. స్టార్ హీరో విలన్‌గా నటించిన పరాశక్తి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరోయిన్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది బ్యూటిఫుల్ శ్రీలీల. అలాగే, తన అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేసిన శ్రీలీల డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి శ్రీలీల తమిళంలో ఎంట్రీ ఇచ్చిన సినిమా పరాశక్తి.

విలన్‌గా హీరో జయం రవి
తమిళంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పరాశక్తి సినిమాలో హీరోగా శివ కార్తికేయన్ చేశాడు. అలాగే, తమిళ స్టార్ హీరో జయం రవి పరాశక్తి సినిమాలో విలన్‌గా చేయడం విశేషం. అంతేకాకుండా పరాశక్తి సినిమాలో మరో హీరో అథర్వ మురళి కీలక పాత్ర పోషించాడు.మరో కోలీవుడ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ పరాశక్తి సినిమాకు సంగీతం అందించారు.
మరో హైలెట్
గురు, ఆకాశమే నీ హద్దురా వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన లేడి డైరెక్టర్ సుధ కొంగర పరాశక్తి సినిమాకు దర్శకత్వం వహించడం మరో హైలెట్. ఇలాంటి రేర్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్‌లో వచ్చిన పరాశక్తి సినిమా ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో విడుదలైంది.
భారీ బడ్జెట్- రేటింగ్
సుమారు రూ. 150 నుంచి 250 కోట్ల బడ్జెట్‌తో పరాశక్తి సినిమాను తెరకెక్కింది. ఇంత భారీ బడ్జెట్‌తో తీసిన పరాశక్తి సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు మాత్రమే సాధించింది. అలాగే, పరాశక్తి సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.2 రేటింగ్ దక్కింది.
1960స్ కాలంలో కథ
పరాశక్తి సినిమా కథను భాషా అస్తిత్వం, విద్యార్థి ఉద్యమాలు, దేశభక్తి వంటి అంశాల చుట్టూ మలిచారు సుధా కొంగర. మద్రాస్ ప్రావిన్స్‌లో 1960ల కాలంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
సోదరుల న్యాయకత్వం
సెళియన్ (శివకార్తికేయన్), చిన్నదురై (అథర్వ) అనే ఇద్దరు సోదరులు విద్యార్థి ఉద్యమానికి ఎలా నాయకత్వం వహించారు? హిందీ భాషను బలవంతగా రుద్దడంపై వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం.
పరాశక్తి ఓటీటీ స్ట్రీమింగ్
రాజకీయ వ్యవస్థలోని లోపాలను, అప్పటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ఈ చిత్రంలో చూపించారు. ఇలాంటి పరాశక్తి ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 7) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో నేటి నుంచి పరాశక్తి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
జీ5 ఓటీటీలో
కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం వంటి నాలుగు సౌత్ భాషల్లో పరాశక్తి ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు శ్రీలీల తమిళ పొలిటికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి సినిమాను జీ5 ఓటీటీలో తెలుగులోనూ ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


