OTT Trending: ఓటీటీ రిలీజ్ నుంచి టాప్ 1 ట్రెండింగ్‌లో యాక్షన్ థ్రిల్లర్- మాఫియాపై తండ్రికూతుళ్ల పోరాటం- తెలుగులోనూ!

OTT Trending Movie In Telugu: బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ స్టార్ హీరో అనిల్ కపూర్ నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సుబేదార్ ఓటీటీలో రిలీజ్ నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. తండ్రి కూతుళ్ల అనుబంధం, మాఫియాపై వారి పోరాటం నేపథ్యంలో సాగే సుబేదార్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.

Mar 11, 2026, 18:04:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వయసు కేవలం అంకె మాత్రమేనని అనిల్ కపూర్ మరోసారి నిరూపించారు. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సుబేదార్ ఓటీటీలోకి వచ్చేసింది. సుబేదార్ ఓటీటీ రిలీజ్ కావడమే కాదు మొదటి రోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఓటీటీ రిలీజ్ నుంచి టాప్ 1 ట్రెండింగ్‌లో యాక్షన్ థ్రిల్లర్- మాఫియాపై తండ్రికూతుళ్ల పోరాటం- తెలుగులోనూ!
ఓటీటీ రిలీజ్ నుంచి టాప్ 1 ట్రెండింగ్‌లో యాక్షన్ థ్రిల్లర్- మాఫియాపై తండ్రికూతుళ్ల పోరాటం- తెలుగులోనూ!

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన సుబేదార్ డిజిటల్ ఆడియెన్స్‌ను అమితకంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో తండ్రి కూతళ్ల అనుబంధం, మాఫియాపై వారు చేసే పోరాటంకి సంబంధించిన ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి.

ఖుష్బూ సుందర్ కీలక పాత్ర

‘తుమారి సులు’, ‘జల్సా’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన సురేష్ త్రివేణి సుబేదార్ సినిమాకు దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, సురేశ్ త్రివేణి, విక్రమ్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించిన సుబేదార్ సినిమాలో అనిల్ కపూర్‌తోపాటు రాధిక మదన్, మోనా సింగ్, ఆదిత్య రావల్, సౌరభ్ శుక్లా, ఖుష్బూ సుందర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

కథా నేపథ్యం ఏమిటంటే?

మధ్యప్రదేశ్‌లోని ‘కోఖ్’ అనే ఒక గంభీరమైన గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అర్జున్ మౌర్య (అనిల్ కపూర్) ప్రశాంతమైన జీవితం గడపాలని తన స్వగ్రామానికి తిరిగి వస్తాడు. కానీ, అక్కడ ఇసుక మాఫియా అరాచకాలు రాజ్యమేలుతుంటాయి. మరోవైపు, దేశం కోసం తన కుటుంబాన్ని పట్టించుకోలేదనే కోపంతో కూతురు శ్యామ (రాధికా మదన్) తండ్రికి దూరంగా ఉంటుంది.

రెడ్ జిప్సీపై దాడి

తన వ్యక్తిగత జీవితంలో కూతురితో సంబంధాలను సరిదిద్దుకుంటూనే, ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న బాబ్లీ దీదీ (మోనా సింగ్), ఆమె తమ్ముడు ప్రిన్స్ (ఆదిత్య రావల్) ముఠాపై అర్జున్ ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా కథ. ముఖ్యంగా తన భార్య జ్ఞాపకార్థం ఉన్న ‘రెడ్ జిప్సీ’పై మాఫియా దాడి చేయడంతో, ఆ రిటైర్డ్ సైనికుడు మళ్లీ యుద్ధ రంగంలోకి దిగుతాడు.

జాన్ విక్ తరహాలో

ఇది హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సిరీస్ జాన్ విక్ తరహాలో అనిపిస్తుంది. అక్కడ కూడా భార్య జ్ఞాపకార్థంగా ఉన్న కారును చాలా పేరున్న గ్యాంగ్‌స్టర్ కుమారుడు ఎత్తుకెళ్లిపోవడంతో కథ స్టార్ట్ అవుతుంది. అదే పాయింట్‌తో వచ్చిన సుబేదార్‌లో కూతురు అనే ఎమోషన్‌ను ఆవిష్కరించి తెరకెక్కించారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, హృద్యమైన ఎమోషనల్ సీన్స్‌తో సాగే సుబేదార్ ఓటీటీలో అదరగొడుతోంది. మార్చి 5న ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో సుబేదార్ ఓటీటీ రిలీజ్ అయింది. హిందీతోపాటు తెలుగు, తమిళం వంటి మూడు భాషల్లో సుబేదార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

టాప్ 1లో ఓటీటీ ట్రెండింగ్

అయితే, ఓటీటీ రిలీజ్ నుంచే టాప్ 1 ట్రెండింగ్‌లో అమెజాన్ ప్రైమ్‌లో సుబేదార్ దూసుకుపోతోంది. ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో సుబేదార్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునే తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌కు సుబేదార్ మంచి ఆప్షన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More