Kushboo Sundar: వారికి సలహాలు ఇవ్వడం చాలా కష్టం, మేమే నేర్చుకోవాలి.. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ కామెంట్స్
Kushboo Sundar Praised Young Heroines: సుదీర్ఘ విరామం తర్వాత హిందీ వెండితెరపై మెరిసిన ఖుష్బూ సుందర్ నేటి తరం హీరోయిన్స్‌పై, వారి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. వారికి సలహాలు ఇచ్చే స్థాయి నుంచి వారి దగ్గర నేర్చుకునే స్థాయికి సినిమా మారిందని ఖుష్బూ సుందర్ అభిప్రాయపడ్డారు.
చాలా కాలం తర్వాత సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ హిందీ సినిమాలో కనిపించి అందరినీ అలరించారు. సురేష్ త్రివేణి దర్శకత్వంలో వచ్చిన డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిల్మ్ సుబేదార్‌లో అనిల్ కపూర్ భార్యగా ఖుష్బూ సుందర్ ఒక చిన్న పాత్రలో మెరిశారు.

ఖుష్బూ సుందర్ ప్రశంసలు
దాదాపు 45 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఖుష్బూ సుందర్ నేటి తరం యంగ్ హీరోయిన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వాళ్లు చాలా స్మార్ట్ అని కొనియాడారు ఖుష్బూ సుందర్.
సలహాలు ఇచ్చే పని లేదు.. వారే స్మార్ట్!
నేటి తరం నటీమణుల ప్రతిభ గురించి ఖుష్బూ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో వస్తున్న అమ్మాయిలు చాలా స్మార్ట్. నటనలో వారు చూపిస్తున్న ప్రతిభ అద్భుతం. సెట్స్‌కి వచ్చే ముందే వారు తమ హోంవర్క్ అంతా పూర్తి చేసుకుని వస్తున్నారు. అందుకే వారికి సలహాలు ఇవ్వడం ఇప్పుడు చాలా కష్టమైన పని. నిజానికి వారి దగ్గర నుంచే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది" అని కొనియాడారు.
మేకప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు, తమను తాము ప్రజెంట్ చేసుకునే విధానంలో నేటి తరం హీరోయిన్స్ చూపిస్తున్న పరిణతి చూసి తాను ఆశ్చర్యపోతుంటానని ఖుష్బూ సుందర్ అన్నారు. "వారే మాకు పాఠాలు నేర్పిస్తున్నారు, మనం వారి దగ్గర నుంచి కొత్త విషయాలు గ్రహించడమే నయం" అని ఖుష్బూ పేర్కొన్నారు.
ప్రపంచ వేదికలపై భారతీయ తారలు
భారతీయ సినిమా సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి చేరుకోవడం పట్ల ఖుష్బూ హర్షం వ్యక్తం చేశారు. "ప్రియాంక చోప్రా ఆస్కార్స్ వేదికపై ప్రజెంటర్‌గా కనిపిస్తోంది. అలియా భట్ ఇటీవల బాఫ్టా (BAFTA) వేడుకల్లో మెరిసింది. మన చుట్టూ మనం నిర్మించుకున్న గోడలను బద్దలు కొట్టాల్సిన అవసరం నేటి కాలంలో ఎంతైనా ఉంది" అని ఖుష్బూ సుందర్ వివరించారు.
సుబేదార్ ఓటీటీ విశేషాలు
యానిమల్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సుబేదార్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో సుబేదార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
చిన్నదైనా కథకు కీలకం
సుబేదార్‌లో తన పాత్ర నిడివి గురించి ఖుష్బూ సుందర్ స్పందిస్తూ.. "నాకు పాత్ర నిడివి కంటే, కథలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ముఖ్యం. 'సుబేదార్'లో నా రోల్ చిన్నదైనా కథకు అది ఎంతో కీలకం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆసక్తికరమైన పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను" అని తెలిపారు.
ఇకపోతే సుబేదార్ మధ్యప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం. అర్జున్ మౌర్య (అనిల్ కపూర్) అనే రిటైర్డ్ సైనికుడు సమాజంలో ఎదుర్కొనే ఇబ్బందులను, అవినీతిపై చేసే పోరాటాన్ని చూపిస్తుంది.
సుబేదార్ ఓటీటీ రిలీజ్
మార్చి 5న ఓటీటీ రిలీజ్ అయిన సుబేదార్ సినిమా అనిల్ కపూర్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో రాధికా మదన్, సౌరభ్ శుక్లా, మోనా సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












