Holi 2026: అమెరికా ఇరాన్ యుద్ధం- దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు, సోనాల్, ఈషా- ఎమోషనల్‌గా ప్రియాంక చోప్రా హోలీ పోస్ట్

Priyanka Chopra Post On Holi 2026 And War: అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. విమానాలు రద్దు కావడంతో మంచు విష్ణు, సోనాల్ చౌహన్ సహా పలువురు భారతీయ నటులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఈ క్లిష్ట సమయంలో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర పోస్ట్ చేశారు.

Published on: Mar 3, 2026, 09:20:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం ప్రపంచం మరో యుద్ధం ముంగిట నిలుచుంది. అమెరికా-ఇరాన్ మధ్య రేగిన చిచ్చు మధ్యప్రాచ్యం (Middle East) అంతటా ఉద్రిక్తతలను పెంచింది. ఫిబ్రవరి 28న ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్యతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

అమెరికా ఇరాన్ యుద్ధం- దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు, సోనాల్, ఈషా- ఎమోషనల్‌గా ప్రియాంక చోప్రా హోలీ పోస్ట్
అమెరికా ఇరాన్ యుద్ధం- దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు, సోనాల్, ఈషా- ఎమోషనల్‌గా ప్రియాంక చోప్రా హోలీ పోస్ట్

ప్రతిచర్యగా దాడి

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్తలు ఈ ఘర్షణను మరింత తీవ్రం చేశాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాలన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయి.

దుబాయ్‌లో చిక్కుకున్న టాలీవుడ్, బాలీవుడ్ తారలు

యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ నర్గిస్ ఫక్రీ, సోనాల్ చౌహాన్, ఈషా గుప్తా ప్రస్తుతం దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

ప్రియాంక చోప్రా ఆశాభావం

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా స్పందించారు. ఇవాళ హోలికా దహనం (మార్చి 3) సందర్భంగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు

"ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఇది చాలా కష్టమైన, భారమైన సమయం. కానీ, చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు మనకు దారి చూపిస్తుంది. చెడుపై మంచి సాధించే విజయానికి ఇది ప్రతీక" అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. యుద్ధం ఆగిపోయి శాంతి చేకూరాలని ప్రియాంక ఆకాంక్షించారు.

రాజమౌళి సినిమాతో ప్రియాంక గ్రాండ్ ఎంట్రీ

ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'ది బ్లఫ్' (The Bluff) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది బ్లఫ్ ఓటీటీ రిలీజ్ అయి మంచి ప్రశంసలు అందుకుంటోంది. అయితే, భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఏమిటంటే.. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పై కనిపించడం.

రాజమౌళి దర్శకత్వంలో

దర్శక ధీర ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

అమెరికా ఇరాన్ యుద్ధం- దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు, సోనాల్, ఈషా- ఎమోషనల్‌గా ప్రియాంక చోప్రా హోలీ పోస్ట్
అమెరికా ఇరాన్ యుద్ధం- దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు, సోనాల్, ఈషా- ఎమోషనల్‌గా ప్రియాంక చోప్రా హోలీ పోస్ట్

తొలి భారతీయ చిత్రంగా

అంటార్కిటికా ఖండంలో షూటింగ్ జరుపుకోనున్న తొలి భారతీయ చిత్రంగా వారణాసి రికార్డు సృష్టించనుంది. ఏప్రిల్ 2027లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇవే కాకుండా హాలీవుడ్ కామెడీ చిత్రం 'జడ్జిమెంట్ డే'లో కూడా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More