OTT Interesting: ఓటీటీలో 12 ఇంట్రెస్టింగ్ సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవి 8- తెలుగులో 7- వీకెండ్‌కు బెస్ట్-ఇక్కడ చూడండి!

OTT Interesting Movies This Week: ఓటీటీ ప్రియుల కోసం ఫిబ్రవరి చివరి వారంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అదిరిపోయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా నుంచి రాజీవ్ కనకాల వరకు 12 ఇంట్రెస్టింగ్ సినిమాల్లో వీకెండ్‌కు బెస్ట్‌గా 8 సినిమాలు ఉన్నాయి.

Published on: Feb 27, 2026, 13:07:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా ప్రియులకు వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ వారం మీ వినోదానికి లోటు లేకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనరల్లో ఇంట్రెస్టింగ్‌గా 12 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవేంటో లుక్కేద్దాం.

ఓటీటీలో 12 ఇంట్రెస్టింగ్ సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవి 8- తెలుగులో 7- వీకెండ్‌కు బెస్ట్-ఇక్కడ చూడండి!
ఓటీటీలో 12 ఇంట్రెస్టింగ్ సినిమాలు- కచ్చితంగా చూడాల్సినవి 8- తెలుగులో 7- వీకెండ్‌కు బెస్ట్-ఇక్కడ చూడండి!

ది బ్లఫ్ ఓటీటీ

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఇది. ఒకప్పుడు సముద్రపు దొంగగా ఉన్న మహిళ, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ ఆయుధం ఎలా పట్టిందనేదే కథ. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఫిబ్రవరి 25 నుంచి ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

బుగోనియా ఓటీటీ

హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా స్టోన్ నటించిన బుగోనియా చిత్రం ఒక వింతైన కథాంశంతో సాగుతుంది. ఒక కంపెనీ సీఈఓను ఏలియన్ అని భావించి కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఫిబ్రవరి 28న జియో హాట్‌స్టార్‌లో బుగోనియా ఓటీటీ రిలీజ్ అయింది.

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడటలేదు ఓటీటీ

రాజీవ్ కనకాల, ఉదయ భాను ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగ క్రైమ్ థ్రిల్లర్ ఇది. తప్పిపోయిన తన కూతురి కోసం ఒక తండ్రి చేసే పోరాటం, ఆ క్రమంలో బయటపడే కుటుంబ రహస్యాలు ఉత్కంఠను రేపుతాయి. జీ5లో నేటి (ఫిబ్రవరి 27) నుంచి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

తడయం ఓటీటీ

1999లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తడయం. సముద్రఖని డిటెక్టివ్ పాత్రలో నటించిన తడయం జీ5లో ఇవాళ ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చేసింది.

హనీ ఓటీటీ

నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై నటించిన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. క్షుద్ర పూజల వల్ల ఒక కుటుంబం ఎలాంటి మానసిక వేదనకు గురైందనేది ఇందులో చూడవచ్చు. సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్‌లలో నేటి నుంచి హనీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక్కీస్ ఓటీటీ

పరమవీర చక్ర గ్రహీత అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత గాథగా తెరకెక్కింది ఇక్కీస్. అగస్త్య నంద, ధర్మేంద్ర కీలక పాత్రల్లో నటించారు. 1971 యుద్ధ నేపథ్యంలో సాగే ఈ చిత్రం దేశభక్తిని ప్రేరేపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (ఫిబ్రవరి 26)లో ఇక్కీస్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

అక్యూజ్డ్ ఓటీటీ

కొంకణ సేన్ శర్మ నటించిన తెలుగు డబ్బింగ్ హిందీ థ్రిల్లర్ సిరీస్ అక్యూజ్డ్ లైంగిక వేధింపుల ఆరోపణల చుట్టూ తిరుగుతుంది. ఒక గౌరవనీయమైన డాక్టర్ జీవితం ఒక్కసారిగా ఎలా తలకిందులైందో ఇందులో చూపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ అక్యూజ్డ్ ఓటీటీలోకి వచ్చేసింది.

బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 2 ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ పాపులర్ రోమాంటిక్ డ్రామా బ్రిడ్జర్టన్ కొత్త ఎపిసోడ్స్ ఫిబ్రవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చాయి. తెలుగులోనూ ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సైకో సయ్యాన్ ఓటీటీ

తేజస్వి ప్రకాష్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సైకో సయ్యాన్ అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఫిబ్రవరి 25 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

సీక్రెట్ స్టోరీస్: రోజ్లిన్ ఓటీటీ

తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ రోజ్లిన్. సీనియర్ హీరోయిన్ మీనా, హీరో వినీత్ ప్రధాన పాత్రలు పోషించిన రోజ్లిన్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 27 నుంచి ప్రీమియర్ అవుతోంది.

సంగ్‌మర్మర్ ఓటీటీ

హిందీలో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన సంగ్‌మర్మర్ ఫిబ్రవరి 26 నుంచి జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో ప్రదర్శితమవుతోంది. తెలుగులో కూడా సంగ్‌మర్మర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్ ఓటీటీ

లియోనార్డో డికాప్రియో నటించిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్ జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

కచ్చితంగా చూడాల్సినవి

ఇలా ఈ వారం 12 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వీటిలో వీకెండ్‌కు కచ్చితంగా చూడాల్సిన సినిమాలుగా హనీ, సంగ్‌మర్మర్, ది బ్లఫ్, బుగోనియా, అక్యూజ్డ్, రోజ్లిన్, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు, తడయం సినిమాలు బెస్ట్‌గా 8 ఉంటే.. తెలుగులో అన్ని కలిపి 7 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More