OTT: ఈ ఓటీటీ సిరీస్‌లో బోలెడన్నీ ట్విస్టులు ఉంటాయి, నిరాశపరచదు- ఉదయ భానుతో నేను చేసిన ప్రతీది హిట్ అయింది: రాజీవ్ కనకాల

ఓటీటీలోకి వస్తోన్న మరో తెలుగు ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ నటించిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీవ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Feb 24, 2026, 10:00:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ పాపులర్ నటీనటులు రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఓటీటీ వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.

ఈ ఓటీటీ సిరీస్‌లో బోలెడన్నీ ట్విస్టులు ఉంటాయి, నిరాశపరచదు- ఉదయ భానుతో నేను చేసిన ప్రతీది హిట్ అయింది: రాజీవ్ కనకాల
ఈ ఓటీటీ సిరీస్‌లో బోలెడన్నీ ట్విస్టులు ఉంటాయి, నిరాశపరచదు- ఉదయ భానుతో నేను చేసిన ప్రతీది హిట్ అయింది: రాజీవ్ కనకాల

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స్ట్రీమింగ్

తెలుగు ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జోనర్‌లో ఈ వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ర్ రావు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ను మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. "‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. నేను ఇప్పటి వరకు ఎన్నో రకరకాల పాత్రల్ని పోషించాను. అయితే ఈ ఓటీటీ సిరీస్‌లో చేసిన కారెక్టర్ మాత్రం మైల్‌స్టోన్‌లా నిలుస్తుంది" అని అన్నారు.

కొత్తగా చూపించారు

"ఇందులోని నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. డైరెక్టర్ కృష్ణ నన్ను చాలా కొత్తగా చూపించారు. నా స్నేహితుడు శ్రీరామ్ ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జయంత్ గారు, అనురాధా గారికి థాంక్స్" అని రాజీవ్ కనకాల తెలిపారు.

"ఫిబ్రవరి 27న మా సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఏ ఒక్కరినీ నిరాశ పరచదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఉదయభాను గారితో నేను చేసిన ప్రతీ ప్రాజెక్ట్ హిట్ అయింది. ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను" అని నటుడు రాజీవ్ కనకాల ఆశించారు.

జీ5 ఓటీటీ సంస్థలో

నిర్మాత కేవీ శ్రీరామ్ మాట్లాడుతూ .. "జీ5 ఓటీటీ సంస్థలో నాకు జయంత్, అనురాధా మేడం ఇచ్చే సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు రాజీవ్ కనకాల ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు. అయితే ఈ సిరీస్ చూసిన తరువాత నాకు ప్రసాద్ రావు మాత్రమే కనిపించారు. పాత్రలో ఎంతో ఇమిడిపోయారు" అని చెప్పారు.

"ఉదయ భాను నాకు మంచి స్నేహితురాలు. ఆమె పోషించిన కారెక్టర్ ఎంతో బాగుంటుంది. నా ప్రొడక్షన్‌లో నా ఫ్రెండ్స్‌కి మంచి పాత్రలను ఇచ్చాననే సంతృప్తి నాకు కలిగింది. ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అయ్యే ఓటీటీ సిరీస్ ఇది. ప్రతీ ఒక్క ఎపిసోడ్ క్లైమాక్స్‌లా ఉంటుంది. చివరి వరకు థ్రిల్ మెయింటైన్ చేసేలా ఉంటుంది" అని నిర్మాత కేవీ శ్రీరామ్ అన్నారు.

ఫిబ్రవరి 27న ఓటీటీ రిలీజ్

"ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన కృష్ణకి థాంక్స్. ఫిబ్రవరి 27న జీ5లో మా సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి" అని ప్రొడ్యూసర్ కేవీ శ్రీరామ్ కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More