OTT Rating: 10/10 రికార్డ్ గోవిందా- పడిపోయిన సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ రేటింగ్- ముగిసిన పదేళ్ల ఆధిపత్యం- అసలు ఏమైందంటే?
ఓటీటీ చరిత్రలోనే బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్‌గా పేరు ఉన్న బ్రేకింగ్ బ్యాడ్ రేటింగ్ పడిపోయింది. రీసెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగకు వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ప్రీక్వెల్‌గా వచ్చిన షో కారణంగా బ్రేకింగ్ బ్యాడ్ పదేళ్ల ఆధిపత్యం ముగిసిపోయింది. అందుకు కారణైన ఆ ఓటీటీ సిరీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీ చరిత్రలో ఒక దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ఒక రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ‘బ్రేకింగ్ బాడ్’ ఐదో సీజన్‌లోని ‘ఓజిమాండియాస్’ (Ozymandias) ఎపిసోడ్‌కు ఉన్న 10/10 ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్ ఇప్పుడు 9.9కి పడిపోయింది. అయితే, ఈ మార్పు ఎపిసోడ్ కంటెంట్ వల్ల కాకుండా, రెండు షోల అభిమానుల మధ్య మొదలైన ‘డిజిటల్ యుద్ధం’ కారణంగా జరగడం గమనార్హం.

వివాదానికి కారణం ఏంటి?
ఇటీవల సూపర్ హిట్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రీక్వెల్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఫిబ్రవరి 15న విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ ఐదో ఎపిసోడ్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ ది మదర్’ (In the Name of the Mother) అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. ఓటీటీ స్ట్రీమింగ్ అయిన వెంటనే దీనికి కూడా ‘ఓజిమాండియాస్’ తరహాలోనే 10/10 రేటింగ్ లభించింది.
కానీ, కొద్దిరోజుల్లోనే ఈ రేటింగ్ 9.8కి, ఆపై 9.7కి పడిపోయింది. ‘బ్రేకింగ్ బాడ్’ అభిమానులే కావాలని తమ షో రికార్డును కాపాడుకోవడానికి ఈ కొత్త ఎపిసోడ్‌పై ప్రతికూల రివ్యూలతో దాడి (Review Bombing) చేశారని ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ప్రతీకారంగా ‘రివ్యూ బాంబింగ్’
తమ షో రేటింగ్ తగ్గించడాన్ని తట్టుకోలేకపోయిన ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’ అభిమానులు ప్రతీకారానికి దిగారు. సోషల్ మీడియా వేదికగా ఒక్కటై ‘ఓజిమాండియాస్’ ఎపిసోడ్‌కు తక్కువ రేటింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు.దాంతో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం (ఫిబ్రవరి 20) ఈ ఎపిసోడ్ రేటింగ్ 9.9కి పడిపోయింది.
మొత్తం 3.35 లక్షల రేటింగ్స్‌లో కేవలం గత 24 గంటల్లోనే దాదాపు 50 వేల మంది '1 అవుట్ ఆఫ్ 10' రేటింగ్ ఇవ్వడం ఈ దాడి తీవ్రతను సూచిస్తోంది.
క్లాసిక్ వర్సెస్ న్యూ సెన్సేషన్
రాయన్ జాన్సన్ దర్శకత్వంలో 2013లో వచ్చిన బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్‌లోని ‘ఓజిమాండియాస్’ ఎపిసోడ్ ఒక మాస్టర్‌పీస్‌గా గుర్తింపు పొందింది. బ్రయాన్ క్రాన్‌స్టన్ నటన, ఆ ఎపిసోడ్‌లో జరిగే కీలక పాత్ర మరణం ప్రేక్షకులను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తాయి. దీన్ని ‘ఓటీటీ చరిత్రలోనే అత్యుత్తమ హవర్’గా చాలామంది వర్ణిస్తారు.
మరోవైపు, ఐరా పార్కర్ సృష్టించిన ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’ ఓటీటీ సిరీస్ డ్రాగన్లు, భారీ యుద్ధాలు లేకపోయినా కేవలం భావోద్వేగపూరితమైన కథనంతో విజయం సాధించింది. పీటర్ క్లాఫీ, డెక్స్‌టర్ సోల్ అన్సెల్ ప్రధాన పాత్రల్లో నటించి ఈ ఓటీటీ సిరీస్ మొదటి సీజన్ ఫినాలే ఈ వారాంతంలో స్ట్రీమింగ్ కానుంది.
ఫ్యాన్ వార్ వల్లే
పదేళ్లుగా ఓటీటీలో 10/10 రేటింగ్‌తో ఆధిపత్యం చెలాయించిన బ్రేకింగ్ బ్యాడ్ ఓజిమాండియస్ ఎపిసోడ్ ఇప్పుడు ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ సిరీస్‌తో 9.9కి పడిపోయింది. రెండు ఓటీటీ షోల ఫ్యాన్స్ వార్ వల్ల ఈ బ్రేకింగ్ బ్యాడ్‌కు ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ అండ్ జియో హాట్‌స్టార్ ఓటీటీలు
ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో బ్రేకింగ్ బ్యాడ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా.. జియో హాట్‌స్టార్‌లో ఏ నైట్ ఆప్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా ఏ నైట్ ఆప్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












