ఏ బ్యూటిపుల్ బ్రేకప్ రివ్యూ- విడిపోదామనుకుని దెయ్యం చేతిలో చిక్కే ప్రేమ జంట- ఇళయరాజా మ్యూజికల్ మూవీ ఎలా ఉందంటే ?

ఇంగ్లీష్‌లో రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన లేటెస్ట్ మూవీ ఏ బ్యూటిఫుల్ బ్రేకప్. తక్ష్ ముద్రగడ, మటిల్డా బజర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Feb 19, 2026 12:54 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: ఏ బ్యూటిఫుల్ బ్రేకప్

ఏ బ్యూటిపుల్ బ్రేకప్ రివ్యూ- విడిపోదామనుకుని దెయ్యం చేతిలో చిక్కే ప్రేమ జంట- ఇళయరాజా మ్యూజికల్ మూవీ ఎలా ఉందంటే ?
ఏ బ్యూటిపుల్ బ్రేకప్ రివ్యూ- విడిపోదామనుకుని దెయ్యం చేతిలో చిక్కే ప్రేమ జంట- ఇళయరాజా మ్యూజికల్ మూవీ ఎలా ఉందంటే ?

నటీనటులు: తక్ష్ ముద్రగడ, మటిల్డా బజర్

దర్శకత్వం: అజిత్ వాసన్ ఉగ్గిన

సంగీతం: మాస్ట్రో ఇళయరాజా

నిర్మాతలు: ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణ

జోనర్: రొమాంటిక్ హారర్ థ్రిల్లర్

భాష: ఇంగ్లీష్

విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026

డిఫరెంట్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఏ బ్యూటిఫుల్ బ్రేకప్. తక్ష్ ముద్రగడ, మటిల్డా బజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

విడిపోవడానికి సిద్ధమైన ఒక యువ జంట తమ అనుబంధాన్ని గౌరవప్రదంగా, బ్యూటిపుల్ బ్రేకప్‌గా ఉండాలనుకుంటారు. అందుకోసం ఒక విహారయాత్రకు వెళ్తారు. ఈ క్రమంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలోని ఎస్టేట్‌కు చేరుకుంటారు వారిద్దు.

అక్కడ వారి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, భావోద్వేగాలతో పాటు కొన్ని వింతైన, భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అందుకు కారణం ఏంటీ? యువ జంటకు ఎదురైన సంఘటనలు ఏంటీ? అసలు వాళ్లు ఎందుకు బ్రేకప్ చెప్పుకోవాలనుకున్నారు? మరి ఆ లవ్ బర్డ్స్ సంతోషంగా విడిపోయారా? లేదా మళ్లీ కలిశారా? అనేది తెలియాలంటే? ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

రెగ్యులర్ హారర్ థ్రిల్లర్స్‌ల కాకుండా డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. ఇద్దరు ప్రేమికుల బ్రేకప్ అందంగా ఉండాలనుకుని టూర్‌కు వెళ్లడం, ఓ భవనంలో చిక్కుకోవడం, అక్కడ సీసాలో బంధించిన ఆత్మను మేల్కలపడం, ఆ యువ జటంతో ఆత్మ ఏం చేసిందనే అంశాలతో సినిమా సాగుతుంది.

ఆత్మ వల్ల ప్రేమికులకు ఎదురైన అనుభవాలు, వింత సంఘటనలతోపాటు బోల్డ్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ సినిమాకు అతిపెద్ద బలం మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం. లండన్‌లోని ప్రసిద్ధ 'బో టై ఆర్కెస్ట్రా'తో కలిసి ఆయన చేసిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

హైలెట్‌గా కెమిస్ట్రీ

ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాలను పండించడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. కొత్తవారైనప్పటికీ తక్ష్, మటిల్డా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే డ్రామా కావడంతో వారి మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్స్ హైలైట్‌గా నిలిచాయి.

ఇక దర్శకుడు అజిత్ వాసన్ ఒక వెరైటీ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. అది తెరకెక్కించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. చిక్కమగళూరు అడవుల్లో తీసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే. క్లైమాక్స్ ఊహించేలా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:

లవ్, ఎమోషన్స్

ఇళయరాజా మ్యూజిక్, సింఫనీ స్కోర్

సినిమాటోగ్రఫీ, లొకేషన్స్

డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్:

స్లో నెరేషన్

రెగ్యులర్ లవ్ సీన్స్

ఫైనల్‌గా చెప్పాలంటే

ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అనేది సాధారణ దెయ్యాల సినిమా కాదు, ఇదొక హారర్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్. హారర్ చిత్రాల్లో కొత్తదనం కోరుకునే వారికి, ఇళయరాజా సంగీత అభిమానులకు ఇది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. హారర్‌లో డిఫరెంట్ మూవీని ట్రై చేయాలనుకునేవారు ఏ బ్యూటిపుల్ బ్రేకప్ సినిమాపై లుక్కేయొచ్చు.

రేటింగ్ : 2.5/5