పెళ్లి చేసుకోనున్న మరో జంట- ఒక్కటి కానున్న బాలీవుడ్, క్రికెట్ ప్రపంచం- కామెంటేటర్ గౌరవ్ కపూర్‌తో ఓటీటీ నటి కృతికా వివాహం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో జంట కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ నటి, ఓటీటీ సిరీస్ ఫేమ్ కృతికా కమ్రా, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత గౌరవ్ కపూర్ త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. మార్చిలో ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగనుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక, విజయ్ వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సమయంలో మరో జంట కూడా మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానుంది.

బాలీవుడ్-క్రికెట్ ప్రపంచం
బాలీవుడ్-క్రికెట్ ప్రపంచం మరోసారి ఒక్కటి కానుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ నటి కృతికా కమ్రా, ప్రముఖ టెలివిజన్ ప్రజెంటర్, క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్ గౌరవ్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. గతేడాది డిసెంబర్‌లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఈ ఏడాది మార్చిలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
ముంబైలో నిరాడంబరంగా వేడుక
మార్చి 11, 2026న ముంబైలోని గౌరవ్ కపూర్ నివాసంలో వైభవంగా కాకుండా అత్యంత ఆత్మీయుల మధ్య వీరి వివాహం జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో గౌరవ్ కపూర్, కృతికా కమ్రా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఆ తర్వాత మార్చి 12న ముంబైలో సినీ, క్రికెట్ రంగ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ఆర్భాటంగా కంటే అర్థవంతంగా
"కృతిక, గౌరవ్‌లు తమ పెళ్లి ఆర్భాటంగా ఉండటం కంటే, అర్థవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. సంప్రదాయాలకు విలువనిస్తూనే, తమ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా వేడుకలు హుందాగా ఉండాలని ప్లాన్ చేశారు" అని ఈ జంటకు సన్నిహితంగా ఉండేవారు పేర్కొన్నారు.
గుట్టుగా సాగిన ప్రేమాయణం
కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న గౌరవ్, కృతికా జంట గతేడాది డిసెంబర్‌లో సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేశారు. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వీరి ప్రేమ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే, వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా బహిరంగంగా ఎక్కువగా మాట్లాడలేదు.
కృతిక కెరీర్ విశేషాలు
ఇదిలా ఉంటే, 2007లో 'యహాన్ కే హమ్ సికందర్' సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన టీవీ నటి కృతికా కమ్రా 'కితనీ మొహబ్బత్ హై'తో స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత 'కుచ్ తో లోగ్ కహేంగే', 'రిపోర్టర్స్' వంటి హిట్ షోలతో మెప్పించింది.
ఓటీటీ సిరీస్‌లతో క్రేజ్
'మిత్రో' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతికా 'తాండవ్', 'బంబాయ్ మేరీ జాన్', 'గ్యారహ్ గ్యారహ్' వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 'ది గ్రేట్ షంసుద్దీన్ ఫ్యామిలీ' చిత్రంలో ఆమె కనిపించి అట్రాక్ట్ చేసింది.
మట్కా కింగ్ ఓటీటీ సిరీస్
ప్రస్తుతం విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మట్కా కింగ్' ఓటీటీ సిరీస్‌లో కృతిక కమ్రా కీలక పాత్ర పోషిస్తోంది. 1960ల నాటి ముంబై క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


