రేపే రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ పెళ్లి? వైరల్ అవుతోన్న ఇద్దరు అమ్మాయిల వీడియో- ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో డెకరేషన్స్
Rashmika Vijay Wedding: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో జరుగుతున్న ఏర్పాట్లు వీరి పెళ్లి కోసమేనంటూ ఒక వీడియో బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. ముఖ్యంగా 2025 అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగిందన్న ఊహాగానాలు వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ ఎప్పుడు ఒక్కటవుతారా అని అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.

రాజస్థాన్ ప్యాలెస్‌లో పెళ్లి పనులు?
రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో భారీ స్థాయిలో అలంకరణలు జరుగుతున్న దృశ్యాలు ఒక వీడియో రూపంలో బయటకు వచ్చాయి. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ప్యాలెస్‌లోని అలంకరణలను (డెకరేషన్స్) చూపిస్తూ, "ఫిబ్రవరి 2న విజయ్, రష్మికల వివాహం ఇక్కడే జరగబోతోంది" అని చెప్పడం విశేషం. ప్యాలెస్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ వేదికలు, పూల అలంకరణలు, షాండ్లియర్లు (ఝుమర్లు) చూస్తుంటే అక్కడ ఏదో పెద్ద వేడుక జరగబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
రహస్య నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో రష్మిక, విజయ్ ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఈ జంట ఫిబ్రవరి 2026లో వివాహం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి.
పెళ్లిని చాలా వ్యక్తిగతంగా, కేవలం అత్యంత సన్నిహితుల మధ్యే జరపాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఉదయ్‌పూర్‌లోని ఒక హెరిటేజ్ ప్రాపర్టీని ఈ వేడుక కోసం ఖరారు చేసినట్లు టాక్. ఇక ఇప్పుడు రేపే (ఫిబ్రవరి 2) విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్త హల్‌చల్ అవుతోంది.
'గీత గోవిందం' నుంచి మొదలైన ప్రయాణం
2018లో విడుదలైన 'గీత గోవిందం', ఆ తర్వాత వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో విజయ్-రష్మికల కెమిస్ట్రీ చూసి వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు అప్పట్లోనే మొదలయ్యాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి రష్మికను ప్రశ్నించగా.. "గత నాలుగేళ్లుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. అందరూ ఆ వార్త కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు" అంటూ సమాధానం దాటవేశారు. అయితే, రష్మిక, విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
వైరల్ వీడియోపై సన్నిహిత వర్గాలు
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వైరల్ వీడియోపై రష్మిక మందన్నా సన్నిహిత వర్గాలు స్పందిస్తూ అవి కేవలం వదంతులేనని చెబుతున్నాయి. ఏది ఏమైనా, వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ జంట నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతున్నారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


