OTT Series : సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ నుంచి 3వ సీజన్- ఉత్కంఠంగా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 3 టీజర్- డ్రాగన్ యుద్ధం మళ్లీ మొదలు!
OTT Series House Of The Dragon Season 3 Teaser Released: వెస్ట్రోస్ గడ్డపై అధికార దాహం, వారసత్వ పోరు పతాక స్థాయికి చేరింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్ 3 టీజర్‌ను హెచ్‌బిఓ (HBO) తాజాగా విడుదల చేసింది. హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.
గ్లోబల్ సెన్సేషన్ ఓటీటీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అభిమానులకు మరో అద్భుతమైన విజువల్ ట్రీట్ సిద్ధమైంది. టార్గేరియన్ వంశస్థుల మధ్య సాగే రక్తపాతాన్ని కళ్లకు కట్టే ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ (House of the Dragon) సీజన్ 3 టీజర్ గురువారం (ఫిబ్రవరి 19) విడుదలైంది. కేవలం ఒక నిమిషం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో యుద్ధం తాలూకు భీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది.

టీజర్‌లో ఏముంది?
గత సీజన్‌లో ఎగన్ వైకల్యం పొందిన తర్వాత ఐరన్ థ్రోన్‌పై ఎమండ్ టార్గేరియన్ ఆసీనుడై ఉండటాన్ని మనం చూడవచ్చు. మరోవైపు, క్వీన్ అలిసెంట్ హైటవర్ తన నగరాన్ని కాపాడుకునేందుకు రహస్యంగా కింగ్స్ ల్యాండింగ్‌ను వీడి తన చిరకాల ప్రత్యర్థి రైనీరా దళాలకు లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్లు టీజర్ సంకేతాలిచ్చింది.
కొత్త డ్రాగన్స్
రైనీరా తన సైన్యంలో కొత్త డ్రాగన్లను చేర్చుకోవడం అలిసెంట్ కుటుంబానికి పెద్ద దెబ్బగా మారబోతోంది. ఈ సీజన్‌లో నవలల్లోనే అత్యంత కీలకమైన 'బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్' (Battle of the Gullet) యుద్ధం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సముద్రంపై వేలేరియన్ నావికాదళానికి, డ్రాగన్లకు మధ్య జరిగే భీకర పోరాట దృశ్యాలు టీజర్‌లో అద్భుతంగా ఉన్నాయి.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జూన్ నెలలో జియో హాట్‌స్టార్‌లో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సిరీస్ హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ రాసిన 'ఫైర్ అండ్ బ్లడ్' నవల ఆధారంగా రూపొందిన ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు సుమారు 200 ఏళ్ల ముందు జరిగిన కథగా సాగుతుంది.
సూపర్ హిట్ ఓటీటీ సిరీస్
మొత్తం నాలుగు సీజన్లతో ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ ముగుస్తుందని హెచ్‌బిఓ ఇప్పటికే ధృవీకరించింది. కాబట్టి ఇది చివరికి ముందు (Penultimate) సీజన్ కానుంది హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ 3.
కొత్తగా రంగంలోకి దిగుతున్న నటీనటులు
ఇక ఈ సీజన్ 3లో కొత్త నటీనటులు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎమ్మా డి ఆర్సీ, మాట్ స్మిత్, ఒలివియా కుక్ వంటి పాత నటీనటులతో పాటు జేమ్స్ నార్టన్ - ఓర్ముండ్ హైటవర్‌గా, టామీ ఫ్లానాగన్ - లార్డ్ రోడెరిక్ డస్టిన్‌గా, డాన్ ఫోగ్లర్ - సర్ టోరెన్ మాండర్లీగా కనిపించనున్నారు.
ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ముగింపు దశలో
వీరితో పాటు మరికొంత మంది ప్రతిభావంతులైన నటులు ఈ భారీ యుద్ధంలో పాలుపంచుకోనున్నారు. అలాగే, ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్' ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో ఈ టీజర్ రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


