తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి.. ట్రైలర్ రిలీజ్.. రాజీవ్ కనకాల, ఉదయభాను కాంబో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. రాజీవ్ కనకాల, ఉదయభాను కాంబినేషన్ లో వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ ను బుధవారం (ఫిబ్రవరి 18) రిలీజ్ చేశారు. ఓ అమ్మాయి కనిపించకుండాపోవడం చుట్టూ తిరిగే కథ ఇది.

Published on: Feb 18, 2026, 20:46:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) మరో ఆసక్తికరమైన తెలుగు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాజీవ్ కనకాల, యాంకర్ ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'D/o ప్రసాద్ రావు కనబడుటలేదు' (D/o Prasad Rao Kanabadutaledhu). ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఆ విశేషాలు ఏంటో ఇక్కడ చూడండి.

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి.. ట్రైలర్ రిలీజ్.. రాజీవ్ కనకాల, ఉదయభాను కాంబో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి.. ట్రైలర్ రిలీజ్.. రాజీవ్ కనకాల, ఉదయభాను కాంబో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ ట్రైలర్

ఈ మధ్య సౌత్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన జీ5.. వరుసగా తెలుగు ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'D/o ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే ఉత్కంఠభరితమైన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.

వెబ్ సిరీస్‌లో విలక్షణ నటుడు రాజీవ్ కనకాల ప్రసాద్ రావు రోల్ పోషిస్తుండగా, ప్రముఖ యాంకర్ ఉదయభాను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఆసక్తి నెలకొంది. అలాగే వసంతిక, గాయత్రి భార్గవి, బిందు మౌళి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా రిలీజైన ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. స్వాతి నాయుడు అనే అమ్మాయి కనిపించకుండా పోవడం, ఆమె కోసం తండ్రి ప్రసాద్ రావుతోపాటు ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగడం, ఆమె రూమ్మేట్స్, కొలీగ్స్, చివరికి తండ్రిపైనా అనుమానం వ్యక్తం చేస్తూ కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కథేంటంటే..

ఈ వెబ్ సిరీస్ టైటిల్ సూచించినట్లుగానే.. ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) తన కూతురు స్వాతి (వసంతిక) కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతాడు. ఆమె ఆచూకీ కోసం వెతుకుతూ, పోలీసుల సహాయం కోరతాడు. ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ రెబెక్కా జోసెఫ్ (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది.

విచారణలో భాగంగా స్వాతి అదృశ్యం వెనుక అనేక అబద్ధాలు, వేధింపులు ఉన్నట్లు బయటపడుతుంది. సమయం మించిపోకముందే ప్రసాద్ రావు, రెబెక్కా కలిసి స్వాతిని కాపాడగలిగారా? లేదా? అనేది ఫిబ్రవరి 27న తెలియనుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More