నేరుగా ఓటీటీలోకి శివాజీ, లయ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ లాంచ్ చేయనున్న అనిల్ రావిపూడి.. ఆ హిట్ వెబ్ సిరీస్ డైలాగే టైటిల్
ఓటీటీలోకి నేరుగా ఓ తెలుగు కామెడీ మూవీ వస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన పాపులర్ వెబ్ సిరీస్ 90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లోని ఫేమస్ డైలాగ్ సాంప్రాదాయిని సుప్పిని సుద్దపూసని అనే టైటిల్ తోనే వస్తుండటం విశేషం.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే డైలాగ్ గుర్తుందా? ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన పాపులర్ వెబ్ సిరీస్ #90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటుడు రోహన్ కి బ్యాక్‌గ్రౌండ్ లో తరచూ వినిపిస్తుంటుంది. ఇప్పుడిదే టైటిల్ తో అదే ఓటీటీలోకి నేరుగా ఓ మూవీ వస్తోంది. దీని ట్రైలర్ ను అనిల్ రావిపూడి లాంచ్ చేయనుండటం విశేషం.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ లాంచ్
ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ మూవీగా వస్తున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ ను శనివారం (ఫిబ్రవరి 7) లాంచ్ చేయబోతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేయనుండటం విశేషం. ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయనుండగా.. ట్రైలర్ పై ఆసక్తి నెలకొంది.
ఈ మూవీలో సీనియర్ నటుడు శివాజీ, లయ, మాస్టర్ రోహన్, ప్రిన్స్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ కొన్ని రోజులుగా ఈటీవీ విన్ ఓటీటీ మూవీని ప్రమోట్ చేస్తుంది. నిజానికి రెండు రోజుల కిందటే ట్రైలర్ ను తీసుకొస్తామని చెప్పినా.. ఇంకా లాంచ్ చేయలేదు. తాజాగా శనివారం లాంచ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ మరోసారి వెల్లడించింది.
“ఎక్సైట్‌మెంట్ మరింత పెరిగింది. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ ను రేపు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేయనున్నాడు. విన్ ఒరిజిన్ ఫిల్మ్ ఫిబ్రవరి 12న ప్రీమియర్ కానుంది. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మ్యాడ్‌నెస్ కు సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని విశేషాలు
ఈ సినిమాకు సంబంధించిన రెండు ప్రధాన విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లయ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్‌తో అలరిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాతో ఆమె ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.
సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఇది చిత్తూరు జిల్లా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హీరో శివాజీ 'శ్రీరామ్' అనే పంచాయితీ సెక్రటరీ పాత్రలో కనిపిస్తాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సాగిపోతున్న అతని జీవితం.. ఒక నేరంతో ఎలా ముడిపడింది? దానివల్ల అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. టైటిల్ చూస్తే సంప్రదాయంగా అనిపిస్తున్నా, కథలో క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కామెడీ గ్యాంగ్ రెడీ..
ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ.. స్టార్ల విషయంలో రాజీ పడలేదు. అలీ, ధన్‌రాజ్, రఘు బాబు, రోషన్ వంటి ప్రముఖ హాస్య నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్ల రాకతో సినిమాలో వినోదానికి కొదవలేదని అర్థమవుతోంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. చాలా కాలం తర్వాత శివాజీ, లయలను ఒకేసారి స్క్రీన్‌పై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


