ఓటీటీలోకి 7 నెలలకు వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్- నదిలో వరుస దారుణ హత్యలు- 7.5 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న (జనవరి 16) క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం బందూక్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నది ద్వీపంలో వరుసగా జరిగే దారుణ హత్యల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ సాధించిన బందూక్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భాషతో సంబంధం ఉండదు. కంటెంట్ బాగుంటే చాలు ఏ భాష చిత్రమైన సరే మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలాంటి సినిమాలు ఇప్పటికీ ఎన్నో ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

ఇన్వెస్టిగేటివ్ అంశాలతో
తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్వెస్టిగేషన్ అంశాలు యాడ్ చేసి మరి తెరకెక్కిన సినిమానే ‘బందూక్’ (Bandook). బందూక్ అంటే తుపాకీ అనే అర్థం వస్తుంది. కన్నడ భాషలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లో బందూక్ సినిమా తెరకెక్కింది.
బందూక్ రేటింగ్
గతేడాది అంటే 2025లో జూలై 25న థియేటర్లలో విడుదలైన బందూక్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విభిన్నమైన కథాంశంతో కన్నడ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.5 రేటింగ్ కూడా సొంతం చేసుకుంది బందూక్ సినిమా.
నది ద్వీపంలో మిస్టరీ మర్డర్లు
ఒక నిర్మానుష్యమైన నది ద్వీపంలో వరుసగా కొన్ని దారుణ హత్యలు జరుగుతాయి. ఆ శవాలను వెలికితీయడానికి వెళ్లిన ఒక బృందం ఈ కేసును ఎలా ఛేదించిందనే ఇన్వెస్టిగేషన్ చుట్టూ బందూక్ కథ తిరుగుతుంది.
రివేంజ్-లోతైన రహస్యాలు
అయితే, ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణాలు కేవలం నేరానికి సంబంధించినవి మాత్రమే కాకుండా కొందరి గతాన్ని, లోతైన రహస్యాలను కూడా బయటపెడతాయి. రాజకీయం, మతం, వ్యక్తిగత ప్రతీకారం, ప్రేమ వంటి అంశాల మేళవింపుతో బందూక్ సినిమా సాగుతుంది.
రా అండ్ రస్టిక్‌గా
రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కిన బందూక్ సినిమాకు మహేష్ రవికుమార్ దర్శకత్వం వహించడంతోపాటు కథను అందించారు. ఈ సినిమాతోనే మహేష్ రవికుమార్ డైరెక్టర్‌గా కన్నడ నాట పరిచయం అయ్యారు. ప్రసన్న కుమార్ సంగీతం సమకూర్చగా.. రోహిత్ కుమార్ విజువల్స్ మూవీలోని డార్క్ థీమ్‌ను ఎలివేట్ చేసేలా ఉన్నాయి.
ఇద్దరు సీరియల్ కిల్లర్స్
ఇక బందూక్ సినిమాలో పార్థా, గోపాలకృష్ణ దేశ్‌పాండే, బాలాజీ మనోహర్, శ్వేతా ప్రసాద్, హరీష్ రాయ్, శంకర్ అశ్వత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే బందూక్ ట్రైలర్ గమనిస్తే ఇందులో ఇద్దరు సీరియల్ కిల్లర్స్ ఉన్నారని అర్థమవుతోంది. పులి వేషాలు, జోకర్ గెటప్ వంటి ఇతర కాస్ట్యూమ్స్‌లలో వచ్చి హత్యలు చేస్తారని తెలుస్తోంది.
బందూక్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇక ఎంగేజ్ చేసే ఈ క్రైమ్ థ్రిల్లర్ బందూక్ నిన్న (జనవరి 16) ఓటీటీలోకి వచ్చేసింది. అంటే, సుమారుగా 7 నెలలకు బందూక్ ఓటీటీ రిలీజ్ అయింది. లయన్స్ గేట్ ప్లేలో నిన్నటి నుంచి బందూక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కేవలం కన్నడ భాషలో మాత్రమే బందూక్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


