ఓటీటీలోకి వచ్చిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్- ఒకరి భర్తను మరొకరు చంపేలా భార్యల డీల్- ట్విస్టులు అదుర్స్- ఇక్కడ చూడండి!

ఓటీటీలోకి వచ్చిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కర్మ కోర్మా. ఒకరి భర్తను మరొకరు చంపాలని ఇద్దరు భార్యలు డీల్ చేసుకునే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ సాగుతుంది. అదిరిపోయే ట్విస్టులు ఉండే కర్మ కోర్మా ఓటీటీలోకి వచ్చేసింది. మరి కర్మ కోర్మా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Dec 23, 2025, 14:10:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు ప్రత్యక్షమవుతుంటాయి. అలాగే, ఇటీవల ఓటీటీలోకి డిఫరెంట్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒకరి భర్తను మరొకరు చంపేలా ఇద్దరు భార్యలు డీల్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ, ఆ తర్వాత వచ్చే ట్విస్టులు అదిరిపోతూ థ్రిల్లింగ్‌గా సాగుతుంది ఈ సిరీస్.

ఓటీటీలోకి వచ్చిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్- ఒకరి భర్తను మరొకరు చంపేలా భార్యల డీల్- ట్విస్టులు అదుర్స్- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి వచ్చిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్- ఒకరి భర్తను మరొకరు చంపేలా భార్యల డీల్- ట్విస్టులు అదుర్స్- ఇక్కడ చూడండి!

స్నేహం, రొమాంటిక్ అంశాలు

ఓటీటీ సిరీస్ పేరే కర్మా కోర్మా. ఇందులో రివేంజ్‌తోపాటు వంటలు, స్నేహం, రొమాన్స్ అంశాలు కూడా ఉంటాయి. ఊహించని హత్యల చుట్టూ తిరిగే బెంగాలీ వెబ్ సిరీస్ ‘కర్మ కోర్మా’లో రితాభరి చక్రవర్తి, సోహిణి సర్కార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక బెంగాలీ వెబ్ సిరీస్.

వంటగదిలో ఏర్పడిన పరిచయం

మన జీవితంలో 'కర్మ' మనం చేసిన పనుల ఫలితం అయితే.. 'కోర్మా' రుచికరమైన భోజనం. ఈ రెండింటినీ కలిపి ఒక పదునైన క్రైమ్ థ్రిల్లర్‌గా మలిచారు దర్శకుడు ప్రతీమ్ డి. గుప్తా. వంటల ద్వారా ఇద్దరు మహిళల మధ్య ఏర్పడిన పరిచయం ఒక బలమైన స్నేహంగా మారుతుంది.

భర్తలతో విసిగిపోయి

ఆ తర్వాత వారి వెనుక ఉన్న పగ, ప్రతికారం హత్యలకు దారి తీస్తాయి. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ జీవితంలో తమ భర్తలతో విసిగిపోతారు. ఫైనల్‌గా హత్య చేయాలనుకుంటారు. అందుకు ఒకరి భర్తను మరొకరు చంపాలని డీల్ కుదుర్చుకుంటారు. అందుకు వంటను ఆయుధంగా ఉపయోగించుకుంటారు.

అదిరిపోయే ట్విస్టులు

ఈ క్రమంలోనే ఒకరి భర్తకు మరొకరు పరిచయం అవుతారు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటీ?, అసలు ఏం జరిగింది?, తమ భర్తలను చంపగలిగారా?, ఈ ఇద్దరు ఆడవాళ్లను అనుమానించిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? అనేది తెలియాలంటే కర్మా కోర్మా ఓటీటీ సిరీస్ చూడాల్సిందే.

కర్మా కోర్మా ఓటీటీ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన కర్మా కోర్మా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 12న హోయ్‌చోయ్‌లో కర్మ కోర్మా ఓటీటీ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఓటీటీలోకి కూడా ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుంత బెంగాలీ భాషల్లో మాత్రమే కర్మా కోర్మా ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో

అయితే, అన్ని భాషల వారికి అర్థమయ్యేలా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కర్మా కోర్మా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే బెంగాలీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా పేరున్న రితాభరి చక్రవర్తి, సోహిణి సర్కార్ తమ నటనతో ఈ సిరీస్‌కు ప్రాణం పోశారు.

హత్యల గురించి మాత్రమే కాదు

స్నేహం, వెన్నుపోటు, చీకటి రహస్యాల మధ్య నలిగిపోయే పాత్రల్లో వారు పరకాయ ప్రవేశం చేశారు. "ఈ కథ కేవలం హత్యల గురించి మాత్రమే కాదు, మనసులోని భావోద్వేగాల ప్రయాణం కూడా. వంటగది నేపథ్యంలో ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ చేయడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది" అని చిత్ర యూనిట్ పేర్కొంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More