ప్రియాంక చోప్రా మరింత శక్తివంతమైనది- మహేశ్ బాబు ప్రశంసలు- సూపర్ స్టార్‌ను దోస్త్ అని పిలిచిన వారణాసి హీరోయిన్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వారణాసిలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా జోడీగా నటిస్తున్నారు. అయితే, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం ది బ్లఫ్. ఇటీవల విడుదలైన ది బ్లఫ్ ట్రైలర్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ చూద్దాం.

Published on: Jan 25, 2026, 12:51:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్‌గా నటించిన తాజా చిత్రం ‘ది బ్లఫ్’ (The Bluff). పైరెట్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది బ్లఫ్ ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ప్రియాంక చోప్రా మరింత శక్తివంతమైనది- మహేశ్ బాబు ప్రశంసలు- సూపర్ స్టార్‌ను దోస్త్ అని పిలిచిన వారణాసి హీరోయిన్
ప్రియాంక చోప్రా మరింత శక్తివంతమైనది- మహేశ్ బాబు ప్రశంసలు- సూపర్ స్టార్‌ను దోస్త్ అని పిలిచిన వారణాసి హీరోయిన్

అయితే, తాజాగా ది బ్లఫ్ ట్రైలర్ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నిర్మాత, రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ ప్రశంసలు కురిపించారు. ప్రియాంక చోప్రా నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

మహేశ్ బాబు ఏమన్నారంటే?

మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ది బ్లఫ్’ ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. ప్రియాంక చోప్రాను ‘ఫార్మిడబుల్’ (మరింత శక్తివంతమైనది) అని అభివర్ణించారు. "ట్రైలర్ చాలా బాగుంది. ప్రియాంక చోప్రా మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని మహేశ్ బాబు రాసుకొచ్చారు. దీనికి స్పందించిన ప్రియాంక.. "ధన్యవాదాలు నా దోస్త్" అంటూ మహేశ్ బాబుకు రిప్లై ఇచ్చారు.

అటు ఎస్ఎస్ కార్తికేయ కూడా ప్రియాంక చోప్రా నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రియాంక చోప్రా.. ప్రతిసారీ ఇలాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఎలా మెప్పిస్తారు? ఫిబ్రవరి 25 కోసం వెయిటింగ్" అని కార్తికేయ పేర్కొన్నారు. దానికి ప్రియాంక చోప్రా "చాలా థాంక్స్.. మీరు చాలా మంచివారు" అని బదులిచ్చారు.

ఏమిటీ ‘ది బ్లఫ్’?

19వ శతాబ్దపు కరీబియన్ దీవుల నేపథ్యంలో సాగే కథనే ది బ్లఫ్. ఇందులో ప్రియాంక ఒక మాజీ సముద్రపు దొంగ (Pirate) పాత్రలో కనిపిస్తున్నారు. తన గతాన్ని వదిలేసి ప్రశాంతంగా ఇద్దరు కూతుళ్లతో బతకాలనుకుంటుంది. కానీ, తన కుటుంబాన్ని గతం వెంటాడుతుంటుంది.

తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రియాంక చోప్రా తిరిగి ఆయుధం ఎలా పట్టిందనేది ది బ్లఫ్ సినిమా కథాంశం. అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా ది బ్లఫ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 25 నుంచి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

రాజమౌళి-మహేశ్ ‘వారణాసి’ అప్‌డేట్

మరోవైపు, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కనున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (Varanasi) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

మహేశ్ బాబు ప్రశంసలకు ప్రియాంక చోప్రా రియాక్షన్
మహేశ్ బాబు ప్రశంసలకు ప్రియాంక చోప్రా రియాక్షన్
కార్తికేయ ప్రశంసలకు ప్రియాంక చోప్రా స్పందన
కార్తికేయ ప్రశంసలకు ప్రియాంక చోప్రా స్పందన

ఇందులో మహేశ్ బాబు ‘రుద్ర’గా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా కనిపించనున్నారు. ఇక మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ ఆధారంగా ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి సాగనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More