Alpha OTT: మళ్లీ వాయిదా పడిన అలియా భట్, శార్వరి వాఘ్ ఆల్ఫా- సల్మాన్ ఖాన్‌తో క్లాష్- డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ!

Alia Bhatt Sharvari Wagh Alpha Postponed By Salman Khan: అలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా మళ్లీ వాయిదా పడింది. సల్మాన్ ఖాన్‌తో బాక్సాఫీస్ క్లాష్ ఉన్నందునే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే నేరుగా ఆల్ఫా ఓటీటీ రిలీజ్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు.

Published on: Mar 9, 2026, 16:30:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha) విడుదలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’తో బాక్సాఫీస్ వద్ద తలపడటం ఇష్టం లేక అలియా భట్ తన సినిమాను వాయిదా వేసుకున్నారని కామెంట్స్ వచ్చాయి.

మళ్లీ వాయిదా పడిన అలియా భట్, శార్వరి వాఘ్ ఆల్ఫా- సల్మాన్ ఖాన్‌తో క్లాష్-  డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ!
మళ్లీ వాయిదా పడిన అలియా భట్, శార్వరి వాఘ్ ఆల్ఫా- సల్మాన్ ఖాన్‌తో క్లాష్- డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ!

అంతేకాకుండా ఆల్ఫా సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ సోమవారం (మార్చి 9) ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

జూలై 10న థియేటర్లలో ‘ఆల్ఫా’ జాతర

తాజాగా ఆల్ఫా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘ఆల్ఫా’ చిత్రం జూలై 10, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని 2025 క్రిస్మస్ కానుకగా తీసుకురావాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 17, 2026కు మార్చారు.

సల్లూ భాయ్‌తో పోటీ ఎందుకు

అయితే అదే రోజున సల్మాన్ ఖాన్ నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ కూడా విడుదలవుతుండటంతో, సల్లూ భాయ్‌తో తలపడటం ఎందుకు అని భావించిన ఆదిత్య చోప్రా తన ఆల్ఫా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.

హీరోయిన్ అలియా భట్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "#ALPHA 10.07.2026 థియేటర్లలో కలుద్దాం" అని క్యాప్షన్ ఇచ్చారు. దీనితో ఈ ఆల్ఫా సినిమా నేరుగా ఓటీటీ రిలీజ్ అవుతుందున్న వార్తలకు తెరపడింది.

సల్మాన్ కోసం తప్పుకున్న ఆదిత్య చోప్రా

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా ఈ మార్పును ధృవీకరించారు. "సల్మాన్ ఖాన్ కోసం ఆదిత్య చోప్రా ఒక అడుగు వెనక్కి వేశారు. ఏప్రిల్ 17న జరగాల్సిన పోటీని నివారించేందుకు ‘ఆల్ఫా’ తేదీని మార్చారు" అని ఆయన పేర్కొన్నారు. కేవలం బాక్సాఫీస్ క్లాష్ వల్ల సినిమాల వసూళ్లపై ప్రభావం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్పై యూనివర్స్‌లో మొదటి మహిళా చిత్రం

శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ‘ఆల్ఫా’.. యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో వస్తున్న ఏడో చిత్రం. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3, వార్ 2 వంటి భారీ చిత్రాల సరసన ఇది నిలవనుంది.

గతేడాది 'వార్ 2' పోస్ట్ క్రెడిట్స్ సీన్‌లో ఈ ఆల్ఫా సినిమా గురించి చిన్న క్లూ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి అలియా భట్ మాట్లాడుతూ.. "వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఇది మొదటి మహిళా ప్రధాన యాక్షన్ చిత్రం. మేల్ యాక్టర్స్ లీడ్ రోల్స్ చేసిన సినిమాల స్థాయిలోనే ఇది కూడా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఇది ఒక పెద్ద సాహసం" అని చెప్పుకొచ్చారు.

బాబీ డియోల్, అనిల్ కపూర్ కీ రోల్స్

ఇక ఆల్ఫా సినిమాలో అలియా భట్, శార్వరి వాఘ్‌తోపాటు బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక మహిళా స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More