Music: 3700 కోట్ల వ్యూస్ ఉన్నా ప్రయోజనం ఏంటీ? బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో అన్యాయంపై గళమెత్తిన సంగీత దర్శకుడు తనిష్క్!
Tanishk Bagchi On Bollywood Music Industry: బాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్ తనిష్క్ బాగ్చి హిందీ సంగీత పరిశ్రమలోని లోపాలను ఎత్తిచూపారు. కోట్లాది వ్యూస్ సాధించినా సరైన న్యాయం జరగట్లేదంటూ తనిష్క్ బాగ్చి ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల్లో ఉన్న పారదర్శకత మన దగ్గర లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్‌లో రీమిక్స్ పాటలన్నా, చార్ట్‌బస్టర్ మెలోడీలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు తనిష్క్ బాగ్చి. ముఖ్యంగా 2025లో వచ్చిన 'సయ్యారా' (Saiyaara) ఘన విజయం బాగ్చి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

జరుగుతున్న అన్యాయంపై
అయితే, ఇంతటి విజయం వెనుక ఉన్న చేదు నిజాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అయిన తనిష్క్ బాగ్చి పంచుకున్నారు. హిందీ సంగీత పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్స్‌కు, గాయకులకు జరుగుతున్న అన్యాయంపై తనిష్క్ బాగ్చి గళమెత్తారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక పాట హిట్టయినప్పుడు దాని వెనుక ఉన్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని తనిష్క్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాయల్టీ లేని వ్యవస్థ.. ఆర్థిక అస్థిరత
"వార్తలు, ప్రచారం కోసం పీఆర్ (PR) వ్యవస్థ చాలా ముఖ్యం. కానీ, చాలా మంది ప్రతిభావంతులైన సంగీతకారులు దాన్ని భరించలేరు. విదేశాల్లో సౌండ్ ఇంజనీర్ల నుంచి పాటలు రాసే వారి వరకు అందరికీ రాయల్టీలు అందుతాయి. అది వారికి ఆర్థిక భరోసానిస్తుంది. కానీ భారత్‌లో పరిస్థితి వేరు. ఇక్కడ కేవలం ఒక్కసారే పారితోషికం ఇస్తారు. ఆ తర్వాత ఆ పాట ఎంతటి సంచలనం సృష్టించినా మాకు వచ్చేదేమీ ఉండదు" అని తనిష్క్ బాగ్చి వివరించారు.
"బయటి దేశాల్లో అయితే నాకో ప్రైవేట్ జెట్ ఉండేది"
తన పాటలకు వచ్చిన స్పందన గురించి ప్రస్తావిస్తూ బాగ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనిష్క్. "కేవలం యూట్యూబ్‌లోనే నా పాటలకు 37 బిలియన్ల (3,700 కోట్లు) వ్యూస్ ఉన్నాయి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ లెక్కలు చూస్తే ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ నంబర్స్ విదేశీయులకు చెబితే ఆశ్చర్యపోతారు" అని తనిష్క్ అన్నారు.
"ఇంత వ్యూస్ ఉన్న వ్యక్తికి సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ ఉంటుందని కూడా వారు ఊహిస్తారు. పశ్చిమ దేశాల్లో కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. కానీ, మన దగ్గర ప్రతి పాటకూ మొదటి నుంచి మళ్లీ పోరాడాల్సిందే" అని తనిష్క్ బాగ్చి పేర్కొన్నారు.
భవిష్యత్తులోనైనా రాయల్టీలు అందుతాయని
ప్రస్తుతం ఐపిఆర్ఎస్ (IPRS) వంటి సంస్థల వల్ల పరిస్థితులు కొంచెం మారుతున్నాయని, భవిష్యత్తులో వాద్యకారులకు, సంగీత నిపుణులకు కూడా రాయల్టీలు అందుతాయని తనిష్క్ బాగ్చి ఆశాభావం వ్యక్తం చేశారు.
టెలివిజన్ నుంచి టాప్ కంపోజర్ వరకు..
తనిష్క్ బాగ్చి ప్రయాణం టీవీ షోల నుంచి మొదలైంది. 'థప్కీ ప్యార్ కీ' వంటి సీరియల్స్‌కు సంగీతం అందించిన తనిష్క్ 'కిస్ కిస్కో ప్యార్ కరూన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి సంగీత దర్శకుడిగా అడుగుపెట్టారు.
తనిష్క్ సినిమాలు
'దిల్బర్', 'ఆంఖ్ మారే' వంటి రీమిక్స్ పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తనిష్క్ బాగ్చి గతేడాది 'సయ్యారా' టైటిల్ ట్రాక్‌తో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం 'సన్ ఆఫ్ సర్దార్ 2', 'ధడక్ 2' వంటి క్రేజీ ప్రాజెక్టులతో తనిష్క్ బిజీగా ఉన్నారు.
కోపాతాపాలు లేకుండా
ఎంతటి పేరు వచ్చినా, ఇక్కడ నిలదొక్కుకోవాలంటే పాత విజయాలను మర్చిపోయి రోజూ కొత్తగా పని చేయాల్సిందేనని, ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోకుండా ముందుకు సాగడమే తన మార్గమని తనిష్క్ బాగ్చి ఈ సందర్భంగా తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


