నా ఇంటిపేరే నాకు శాపంగా మారింది, 15 ఏళ్లకే రోడ్డు మీదకు వచ్చా- చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అమాల్
ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు అమాల్ మల్లిక్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న వివక్షను బయటపెట్టారు. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ మల్లిక్ అనే ఇంటి పేరు కారణంగా తనను పనుల నుంచి ఎలా తొలగించేవారో చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అమాల్ మల్లిక్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సంగీత ప్రపంచంలో మల్లిక్ కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఆ ఇంటి పేరే తన కెరీర్‌కు అడ్డంకిగా మారిందని ప్రముఖ సంగీత దర్శకుడు అమాల్ మల్లిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బిగ్ బాస్ 19లో మెరిసిన అమాల్ మల్లిక్ తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పదేళ్ల సుదీర్ఘ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.

15 ఏళ్లకే రోడ్డు మీదకు వచ్చా..
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ 15 ఏళ్ల నుంచే తాను పనులు వెతుక్కున్నానని అమాల్ తెలిపారు. "నాకు 15 నుంచి 25 ఏళ్ల వరకు చాలా కష్టమైన కాలం. ఓ కొడుకుగా బాధ్యత నెరవేర్చడం కోసం ఆ వయసులోనే అసిస్టెంట్, రన్నర్‌గా పనిచేశాను. పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలకు హార్డ్ డిస్క్‌లు చేరవేసే పని కూడా చేశాను. చేతికి దొరికిన చిన్న చిన్న పనులే నాకు జీవనాధారమయ్యాయి" అని అమాల్ మల్లిక్ తన గతాన్ని వివరించారు.
ఇంటిపేరు తెలిస్తే చాలు ఉద్యోగం పీకేసేవారు!
నేపథ్యం ఉన్నవారికి అవకాశాలు సులభంగా వస్తాయనేది అందరి నమ్మకం. కానీ, పాపులర్ సంగీత దర్శకుడు అమాల్ మల్లిక్ విషయంలో అది రివర్స్ అయింది.
"నాకు ఎక్కడైనా అసిస్టెంట్‌గా ఉద్యోగం దొరికినా, నా ఇంటి పేరు 'మల్లిక్' అని తెలిసిన మరుక్షణం నన్ను పనిలో నుంచి తీసేసేవారు. 'వీడు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు.. మన మ్యూజిక్ బయట ఎక్కడైనా అమ్మేస్తాడేమో' అనే అపోహ అప్పట్లో ఉండేది. ఆ అపోహ నాకూ, నా తమ్ముడు అర్మాన్ మల్లిక్‌కు చాలా నష్టం చేసింది. మాకు ఏదీ వెండి పళ్లెంలో పెట్టి వడ్డించలేదు (ఏది సుఖంగా రాలేదన్న అర్థంలో)" అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు అమాల్.
బిగ్ బాస్ నుంచి బాక్సాఫీస్ వరకు..
సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' సినిమాతో అమాల్ మల్లిక్ సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 'సూరజ్ దూబా హై' వంటి సూపర్ హిట్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్న అమాల్ మల్లిక్.. ఎయిర్ లిఫ్ట్, బాఘీ, బద్రీనాథ్ కీ దుల్హనియా వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
ఇటీవల ముగిసిన బిగ్ బాస్ 19 రియాలిటీ షోలో అమాల్ మల్లిక్ టాప్-5 కంటెస్టెంట్‌గా నిలిచారు. హౌస్‌లో ఆయన ప్రవర్తనపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, అభిమానుల మద్దతుతో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నారు.
ఇంటిపేరే శాపంగా
ఐదో స్థానంలో నిలిచి అమాల్ మల్లిక్ బిగ్ బాస్ 19 నుంచి ఎలిమినేట్ అయ్యారు. తన ఇంటిపేరే తనకు శాపంగా మారిందని, కేవలం బ్యాక్ గ్రౌండ్ చూసి కాకుండా, టాలెంట్ చూసి గౌరవించాలని అమాల్ మల్లిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


