సల్మాన్ ఖాన్, కుటుంబంపై డైరెక్టర్ అసభ్య వ్యాఖ్యలు- 9 కోట్ల పరువు నష్టం దావా- దర్శకుడికి కోర్టు షాక్- ఆ హక్కు ఉందంటూ!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబంపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న దర్శకుడు అభినవ్ కశ్యప్‌కు ముంబై కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరులను దూషించడం కాదని స్పష్టం చేస్తూ, తాత్కాలిక స్టే విధించింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన రూ. 9 కోట్ల పరువు నష్టం దావాలో ముంబై కోర్టు కీలక తీర్పునిచ్చింది. సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా దర్శకుడు అభినవ్ కశ్యప్‌ను కోర్టు తాత్కాలికంగా అడ్డుకుంది. ఈ మేరకు జడ్జి పి.జి. భోస్లే శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ఆగ్రహం: 'స్వేచ్ఛ అంటే దూషించడం కాదు'
సల్మాన్ ఖాన్ రూ. 9 కోట్ల పరువు నష్టం దావా కేసులో డైరెక్టర్ అభినవ్ కశ్యప్‌కు ముంబై కోర్ట్ షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
"భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే, ఆ హక్కు పేరుతో ఒక వ్యక్తిపై లేదా వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దూషించడం లేదా బెదిరించడం సరైంది కాదు. ప్రతి వ్యక్తికి తన గౌరవాన్ని, గోప్యతను కాపాడుకునే హక్కు ఉంటుంది" అని కోర్టు స్పష్టం చేసింది.
వివాదం నేపథ్యం ఏమిటి?
గత ఏడాది (సెప్టెంబర్ - డిసెంబర్ 2025) కాలంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన దాదాపు 26 వీడియో ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లలో సల్మాన్ ఖాన్‌పై అభినవ్ కశ్యప్ తీవ్ర విమర్శలు చేశారు.
సల్మాన్ కుటుంబాన్ని 'జిహాదీ ఎకోసిస్టమ్' సభ్యులుగా, 'నేరస్థులుగా' అభివర్ణించడం. సల్మాన్ రూపం, వయస్సుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, ఘోరమైన నేరస్థులతో పోల్చడం. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్, సోదరులు అర్బాజ్, సోహైల్ ఖాన్‌లను లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలం వాడటం వంటివి దర్శకుడు అభినవ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు తన వృత్తి పరమైన ప్రతిష్టను, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని సల్మాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యులను అనవసరంగా ఈ వివాదంలోకి లాగడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు ఆదేశాలు: ఇకపై వ్యాఖ్యలు వద్దు!
అభినవ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించిన కోర్టు, అవి ప్రాథమికంగా సల్మాన్ ఖాన్ ప్రతిష్టమను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడింది.
సోషల్ మీడియాపై ఆంక్షలు: అభినవ్ కశ్యప్, ఖుష్బూ హజారే, సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సల్మాన్ ఖాన్ లేదా ఆయన కుటుంబంపై ఎలాంటి కొత్త వీడియోలు, పోస్ట్‌లు, ట్వీట్లు లేదా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.
కంటెంట్ తొలగింపు: వివాదాస్పదమైన పాత వీడియోలను (26) వెంటనే తొలగించాలని, దీనిపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సల్మాన్ తరపు న్యాయవాది ప్రదీప్ గాంధీ కోరారు.
తాత్కాలిక నిషేధం: తదుపరి విచారణ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని, ప్రతివాదులు తమ సమాధానాలను కోర్టులో దాఖలు చేయాలని జడ్జి ఆదేశించారు.
ఇదిలా ఉంటే, సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ తేరే నామ్ ఫిబ్రవరి 27న రీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


