ఐశ్వర్య రాయ్‌తో లవ్, ప్రాణ భయం ఉందన్న హీరో- అవకాశాలు లేకుండా చేసిన సల్మాన్ ఖాన్- 20 ఏళ్ల నాటి నిజాలు బయటపెట్టిన నిర్మాత
2003లో సల్మాన్ ఖాన్‌పై వివేక్ ఒబెరాయ్ చేసిన సంచలన ఆరోపణలు బాలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఎలా స్పందించాడో ప్రముఖ నిర్మాత శైలేంద్ర సింగ్ తాజాగా వెల్లడించారు. ఐశ్వర్య రాయ్‌తో వివేక్ ఒబెరాయ్ ప్రేమాయణం సమయంలో ఇది జరిగినట్లు శైలేంద్ర సింగ్ తెలిపారు.
బాలీవుడ్ చరిత్రలో సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగిన వివాదం గురించి తెలియని వారుండరు. ఐశ్వర్య రాయ్ ప్రేమ విషయంలో సల్మాన్ ఖాన్ తనను బెదిరిస్తున్నారని, ప్రాణ భయం ఉందంటూ వివేక్ 2003లో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేశారు.

20 ఏళ్ల నాటి షాకింగ్ నిజాలు
సరిగ్గా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు? ఆయన స్పందన ఏంటి? అనే షాకింగ్ నిజాలను 20 ఏళ్ల తర్వాత నిర్మాత శైలేంద్ర సింగ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సల్మాన్ చాలా కోపంగా ఉన్నారు!
ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ.. "వివేక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సమయంలో నేను సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాను. అది చూసి సల్మాన్ విపరీతమైన ఆగ్రహానికి లోనయ్యారు. 'అసలేం జరుగుతోంది ఇక్కడ?' అంటూ అసహనం వ్యక్తం చేశారు. అప్పట్లో సల్మాన్ తన భావోద్వేగాలను దాచుకునేవారు కాదు, వెంటనే బయటపెట్టేసేవారు. ఇప్పుడు మాత్రం ఆయనలో చాలా నిగ్రహం పెరిగింది" అని శైలేంద్ర సింగ్ వివరించారు.
జీవితంలో నటించాలి
సల్మాన్ ఖాన్‌ను శాంతింపజేయడానికి తాను చేసిన ప్రయత్నం గురించి చెబుతూ.. "జీవితంలో నటించాలి (Act), కానీ అనవసరంగా రియాక్ట్ కాకూడదు అని సల్మాన్‌కు చెప్పాను. ఏం చేయాలో తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అతన్ని అలా చేయనివ్వు అని నచ్చజెప్పాను" అని శైలేంద్ర సింగ్ పేర్కొన్నారు.
నిశ్శబ్దంగా పోరాడారు..
ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సల్మాన్‌కు సూచించానని శైలేంద్ర తెలిపారు. "సైలెంట్‌గా యుద్ధం చేయమని చెప్పాను. బహుశా ఆయన అదే చేసి ఉంటారు. ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్‌కు బాలీవుడ్‌లో అవకాశాలు రాకుండా సల్మాన్ జాగ్రత్త పడ్డారని నా అభిప్రాయం. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ, బయటకు కనిపిస్తున్నది మాత్రం అదే" అని శైలేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేక్ ఒబెరాయ్ ఆవేదన
ఈ వివాదం తర్వాత వివేక్ ఒబెరాయ్ కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీనిపై గతంలోనే వివేక్ స్పందిస్తూ.. "షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా వంటి హిట్ తర్వాత కూడా 14 నెలల పాటు పని లేకుండా ఇంట్లో కూర్చోవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు. పరిశ్రమలో నాపై లాబీయింగ్ జరిగిందని అర్థమైంది. అది నన్ను చాలా అలసిపోయేలా చేసింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పిరిట్ మూవీలో వివేక్
ఇదిలా ఉంటే, చాలా కాలం తర్వాత వివేక్ ఒబెరాయ్ ఒక భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సల్మాన్ న్యూ మూవీ
న్యూ నేషనల్ క్రష్, బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న స్పిరిట్ మూవీ 2027 మార్చి 5న విడుదల కానుంది. ఇక సల్మాన్ ఖాన్ అపూర్వ లఖియా దర్శకత్వంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ (Battle of Galwan) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


