శ్రీ చిదంబరం గారు ట్రైలర్ రిలీజ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన- మీ లోపం బలం అవ్వాలన్న మూవీ నిర్మాత
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా శ్రీ చిదంబరం గారు. తాజాగా శ్రీ చిదంబరం గారు ట్రైలర్‌ను రామ్ చరణ్ పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సాన విడుదల చేశారు. ఈ సందర్భంగా యూత్ చిన్న సమస్యలకే సూసైడ్ వరకు వెళ్తోందని, చాలా మందికి ఈ సినిమా ఇన్‌స్పైర్ చేస్తుందని నిర్మాతలు తెలిపారు.
టాలీవుడ్‌లో లేటెస్ట్‌గా తెరకెక్కిన సినిమా 'శ్రీ చిదంబరం గారు'. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. అలాగే, శ్రీ చిందబరం గారు సినిమాకు చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు.

శ్రీ చిదంబరం టీజర్‌కు మంచి స్పందన
'శ్రీ చిదంబరం గారు' సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే, ఇటీవల శ్రీ చిదంబరం గారు మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది.
కీరవాణి ఆలపించిన వెళ్లేదారిలో పాట
కాగా శ్రీ చిదంబరం గారు చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే బ్యూటిఫుల్ పాటను సైతం రీసెంట్‌గా రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ సాంగ్ కూడా టాలీవుడ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన
ఇదే క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా శ్రీ చిదంబరం గారు సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పెద్ది అనే పాన్ ఇండియా చిత్రాన్ని డెరెక్ట్ చేస్తున్న బుచ్చిబాబు సానా విడుదల చేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు సాన శ్రీ చిదంబరం గారు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలా
మూవీ ట్రైలర్‌ను గమనిస్తే.. శ్రీ చిదంబరం గారు ఓ ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. ఈ కథలో కమర్షియల్ మేసేజ్‌తో పాటు ఓ బ్యూటిఫుల్ సందేశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచేవిధంగా ఉంది.
కొత్తవాళ్లతో తీసిన సినిమా
శ్రీ చిదంబరం గారు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "అంతా కొత్తవాళ్లతో తీసిన బ్యూటిఫుల్ సినిమా ఇది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్‌స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న సినిమా ఇది. నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ ఇది" అని అన్నారు.
మీ లోపం బలం అవ్వాలి
"చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యే కథ ఇది. మీలో లోపం మీకు బలం అవ్వాలి అనే చెప్పే కథ ఇది. తప్పకుండా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మెకం ఉంది" అని శ్రీ చిదంబరం గారు నిర్మాతలు పేర్కొన్నారు.
శ్రీ చిదంబరం గారు నటీనటులు
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 6న శ్రీ చిదంబరం గారు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ఈ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


