సీరియల్‌లో విషం తాగే సీన్-రియల్ లైఫ్‌లో సూసైడ్-ఆత్మహత్య చేసుకున్న యువ నటి-అసహజ మరణంగా పోలీసుల విచారణ
యువ సీరియల్ నటి సూసైడ్ చేసుకుంది. సీరియల్ లో విషం తాగే సీన్ చేసిన ఆమె, ఆ తర్వాత కొన్ని రోజులోకే ఆత్మహత్యతో ప్రాణాలు వదిలింది. ఈ నటి మరణం కలకలం రేపుతోంది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కన్నడ టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 26 ఏళ్ల కన్నడ టెలివిజన్ నటి నందిని సీఎం సూసైడ్ చేసుకుంది. బెంగళూరులోని తన పేయింగ్ గెస్ట్ అకామడేషన్‌లో సోమవారం (డిసెంబర్ 29) ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వార్తా సంస్థ పీటీఐ.. పోలీసులను ఉటంకిస్తూ, ఈ సంఘటన కెంగేరి ప్రాంతంలో జరిగిందని చెప్పింది.

సీరియల్ నటి ఆత్మహత్య
కన్నడ సీరియల్ నటి నందిని సీఎం సూసైడ్ చేసుకుంది. సంఘటనా స్థలంలో డెత్ నోట్ లభించింది. స్వాధీనం చేసుకున్న ఈ డెత్ నోట్ ఆధారంగా సీనియర్ పోలీసు అధికారి ఒకరు నందిని డిప్రెషన్, వ్యక్తిగత సమస్యలతో పోరాడుతోందని పేర్కొన్నారు. ఈ నోట్‌లో ఆమె వివాహం చేసుకోవడానికి లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదని పేర్కొందని తెలిపారు.
ఫ్యామిలీ కోరిక
నందిని సీఎం యాక్టింగ్ కెరీర్ ను కొనసాగించాలని అనుకుంది. కానీ ఆమె ఫ్యామిలీ మాత్రం నందిని త్వరగా సెట్ కావాలని కోరుకుంది. ఈ ఒత్తిడి ఆమెపై పడినట్లు తెలుస్తోంది. తన నటన వృత్తిని కొనసాగించాలనుకుంటున్నట్లు, అయితే తన కుటుంబం ఆమెను "స్థిరపడాలని" కోరుకుంటున్నట్లుగా డెత్ నోట్ లో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసుటు అసాధారణ మరణం కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
స్టేట్ మెంట్ రికార్డు
ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద ప్రమేయం లేదని పోలీసులు తెలిపారు. ఎవరిపై ఇప్పుడే అనుమానం లేదన్నారు. "విచారణ పురోగమిస్తున్నప్పుడు మరిన్ని వివరాలు తెలియజేస్తాం" అని ఒక పోలీసు అధికారి లైవ్ మింట్ కు చెప్పారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత సహచరుల స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేస్తున్నామని తెలిపారు.
సీరియల్ లో విషం
నందిని సీఎం ప్రస్తుతం గౌరీ అనే తమిళ సీరియల్‌లో ప్రధాన నటిగా నటిస్తోంది. ఆమె ఇందులో కనక, దుర్గ అనే రెండు పాత్రల్లో నటిస్తోంది. మింట్ ప్రకారం ఇటీవల ఆ సీరియల్ లో ఆమె పాత్ర విషం తాగే సన్నివేశం ప్రసారమైంది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చకు దారితీసింది. ఇప్పుడేమో ఆమె సూసైడ్ చేసుకుంది.
నందిని కన్నడ టెలివిజన్‌లో సహాయక పాత్రలతో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె జీవ హోవాగిడే, సంఘర్ష, మధుమగలు, నీనడే నా వంటి అనేక ప్రసిద్ధ సీరియళ్లలో కనిపించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చివరి పోస్ట్ తన షో గౌరీ నుండి వచ్చిన ప్రోమో. ఇటీవల ఆమె కొన్ని ఫొటోలను పంచుకుంది. ఆమె ఆ పోస్ట్‌కు "లవ్ లవ్" అని క్యాప్షన్ ఇచ్చింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


