టీవీలోకి సరికొత్త సీరియల్- ఓటీటీలో కూడా చూసే అవకాశం- లక్ష్మీ రావే మా ఇంటికి టీవీ ప్రీమియర్ ఎక్కడ, ఎప్పుడంటే?

టీవీలోకి సరికొత్త సీరియల్ లక్ష్మీ రావే మా ఇంటికి ప్రసారం కానుంది. బుల్లితెరతోపాటు ఓటీటీలోనూ ఈ సీరియల్ స్ట్రీమింగ్ కానుంది. రెండు జీవితాల చుట్టూ సాగే కథగా తెరకెక్కిన ఈ సీరియల్‌లో హర్ష్ నాగ్‌పాల్, దర్శిని గౌడ హీరో హీరోయిన్‌గా చేశారు. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ టీవీ ప్రీమియర్ ఎప్పుడో తెలుసుకుందాం.

Published on: Dec 19, 2025, 21:05:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌​లతో సాగే సీరియళ్లను అందిస్తున్న ఛానెల్ జీ తెలుగు. అలాంటి జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్‌​ను అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే కథ, కథనంతో ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక ‘లక్ష్మీ రావే మా ఇంటికి’.

టీవీలోకి సరికొత్త సీరియల్- ఓటీటీలో కూడా చూసే అవకాశం- లక్ష్మీ రావే మా ఇంటికి టీవీ ప్రీమియర్ ఎక్కడ, ఎప్పుడంటే?
టీవీలోకి సరికొత్త సీరియల్- ఓటీటీలో కూడా చూసే అవకాశం- లక్ష్మీ రావే మా ఇంటికి టీవీ ప్రీమియర్ ఎక్కడ, ఎప్పుడంటే?

రాత్రి పది గంటలకు

భావోద్వేగాలు, బంధాలు, బాధ్యతలు, కుటుంబ సవాళ్లతో అల్లుకున్న కథతో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సీరియల్ రూపొందినట్లు మేకర్స్ చెబుతున్నారు. డిసెంబర్​ 22న అంటే సోమవారం నుంచి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు జీ తెలుగులో లక్ష్మీ రావే మా ఇంటికి టీవీ ప్రీమియర్ కానుంది.

రెండు జీవితాల చుట్టూ

‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సీరియల్ కథ అనుకోకుండా ముడిపడిన రెండు జీవితాల చుట్టూ తిరుగుతుంది. అనాథగా పెరిగిన తెలివిగల అమ్మాయి శ్రీలక్ష్మి(దర్శిని గౌడ), ఊహించని విధంగా ధనవంతుడైన మధుసూదన్​(హర్ష్​ నాగ్​‌పాల్​) జీవితంలో అడుగుపెడుతుంది.

లక్ష్మీ రావే మా ఇంటికి కథ

అనేక సమస్యలతో సతమతమయ్యే లక్ష్మి ఆత్మవిశ్వాసంతో మధుసూదన్​ ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంలో లక్ష్మి ఎదుర్కొనే ఇబ్బందులేంటి? లక్ష్మి ఎలా మధుసూదన్​ మనసు గెలుచుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ సోమవారం నుంచి జీ తెలుగులో ప్రసారం కానున్న లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌​ని తప్పకుండా చూడాల్సిందే అని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

సీరియల్ హీరో హీరోయిన్

కుటుంబం, ప్రేమ మధ్య సాగే ఆసక్తికర కథాంశంతో సాగే లక్ష్మీ రావే మా ఇంటికి జీ తెలుగు వీక్షకులను అలరించేందుకు సిద్దమైందని తెలుస్తోంది. ఇకపోతే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌లో హర్ష్​ నాగ్​‌పాల్​, దర్శిని గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సీరియల్ నటీనటులు

వీరితోపాటు మీర్ సయ్యద్, ఐశ్వర్య, ఇందు ఆనంద్, వెంకట్​ గౌడ్, శ్రీ వాణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, అద్భుతమైన కథాంశం, ఆసక్తికరమైన మలుపులతో సాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌​ని మిస్ కాకుండి అంటూ జీ తెలుగు టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దర్శిని గౌడ సీరియల్స్

ఇదిలా ఉంటే, లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌లో హీరోయిన్‌గా చేస్తోన్న దర్శిని గౌడ ఇదివరకు నాగ పంచమి ధారావాహికలోనూ ప్రధాన పాత్ర పోషించింది. అలాగే సిల్లునురు ఒరు కాదల్ అనే కన్నడ సీరియల్‌లోనూ నటించి అట్రాక్ట్ చేసింది దర్శిని గౌడ.

ఓటీటీలో కూడా

అయితే, జీ తెలుగు ఛానెల్‌లోనే కాకుండా ఓటీటీలో కూడా లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌ను వీక్షించవచ్చు. జీ5 ఓటీటీలో లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఉదయం ఆరు గంటల నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, రెండు ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ సీరియల్‌ను ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More