హాలీవుడ్ అవార్డ్ వేడుకల్లో అలియా భట్ హిందీ స్పీచ్- సమంత కామెంట్స్ వైరల్-లెజెండరీ నటి స్టైల్‌లో బాఫ్తాలో మెరిసిన గంగుబాయి
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేదికపై తొలిసారి మెరిసిన అలియా భట్ తన ప్రసంగాన్ని హిందీతో మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలియా భట్ చేసిన ఈ ‘దేశీ’ మ్యాజిక్‌ను చూసి సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఫిదా అయిపోయారు. అలియా భట్‌పై సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియా భట్ అంతర్జాతీయ వేదికలపై తన ముద్రను వేయడం కొనసాగిస్తోంది. తాజాగా లండన్‌లో జరిగిన 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA 2026) వేదికపై ఆమె అవార్డ్ ప్రజెంటర్‌గా మెరిశారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డును అందించే ముందు అలియా తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించి భారతీయ అభిమానుల మనసు గెలుచుకున్నారు.

అలియాకు సమంత ‘చీర్స్’
అలియా భట్ హిందీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ అలియా భట్‌పై ప్రశంసలు కురిపించారు.
ఒక వైట్ హార్ట్ ఎమోజీని జోడించి అలియాను ట్యాగ్ చేశారు. ఇలా హాలీవుడ్ వేదిక అయిన బఫ్తా అవార్డ్ వేడుకల్లో అలియా భట్ హిందీ స్పీచ్‌ను సమంత పొగడటం వైరల్‌గా మారింది.
నిజానికి అలియాను సమంత సమర్థించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆలియా చిత్రం ‘జిగ్రా’పై విమర్శలు వచ్చినప్పుడు కూడా సమంత అండగా నిలిచారు.
"నువ్వు ఒక ఆడపులివి (Tigress).. నీ నటన నుంచి కళ్లు తిప్పుకోలేకపోతున్నాను.. నీ ధైర్యవంతమైన నిర్ణయాలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం" అంటూ అలియాను అప్పట్లో ప్రశంసల్లో ముంచెత్తారు సమంత.
మర్లిన్ మన్రో లుక్‌లో ఆలియా సందడి
ఇకపోతే ఈ అవార్డు వేడుక కోసం ఆలియా వెండి రంగు సీక్విన్ గౌను ధరించి, దానిపై వైట్ ఫర్ స్టోల్ (fur stole) వేసుకున్నారు. లెజెండరీ నటి మర్లిన్ మన్రో స్టైల్‌ను తలపించేలా ఉన్న ఈ లుక్‌లో అలియా ఎంతో అందంగా కనిపించారు.
స్టేజ్ పైకి వచ్చిన ఆలియా.. "నమస్కార్! అగ్లా అవార్డ్ ఏక్ ఐసీ ఫిల్మ్ కే లియే హై, జో అంగ్రేజీ మే నహీ హై" (తదుపరి అవార్డు ఇంగ్లీష్‌లో లేని చిత్రం కోసం) అంటూ హిందీలో మొదలుపెట్టారు.
ఆ తర్వాత నవ్వుతూ.. "అప్పుడే సబ్‌టైటిల్స్ కోసం వెతకకండి. సినిమాకు ఎన్ని గళాలు ఉన్నా, మనం జరుపుకునేది సినిమా భాషనే.. ఆ భాష మనందరికీ స్పష్టంగా తెలుసు" అంటూ ఇంగ్లీష్ భాషా చిత్రాలు కాని విభాగంలో నామినీలను ప్రకటించారు.
సినిమా విశేషాలు
కెరీర్ విషయానికొస్తే.. సమంత త్వరలో ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె ఒక సాదాసీదా గృహిణిగా కనిపిస్తూనే విలన్ల అంతు చూసే తీసే పాత్రలో నటించారు. ఈ సినిమా మే 15న విడుదల కానుంది. అలాగే రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ‘రక్త బ్రహ్మాండ్’లోనూ సమంత నటిస్తున్నారు.
మరోవైపు తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న అలియా భట్ గంగూభాయి కతియావాడి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రం ‘ఆల్ఫా’ (Alpha)లో నటిస్తున్నారు. శార్వరీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. వీటితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలోనూ ఆలియా నటించనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


