స్మృతి మంధానను చీట్ చేశాడనే ఆరోపణలు- ఇన్‌స్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేసిన పలాష్ ముచ్చల్- 10 కోట్ల పరువు నష్టం

గతేడాది నవంబర్ లో జరగాల్సిన టీమిండియా స్టార్ వుమెన్ క్రికెటర్ స్మృతి మంధాన- మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్మృతి మంధానను పలాష్ చీట్ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ లో స్మృతితో ఉన్న పోస్టులన్నింటినీ పలాష్ డిలీట్ చేశాడు.

Jan 25, 2026, 15:08:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. పెళ్లి ఫిక్స్ కావడానికి ముందే స్మృతిని పలాష్ చీట్ చేశాడని స్మృతి ఫ్రెండ్ విద్యన్ మానే ఆరోపించాడు. ఈ నేపథ్యంలో స్మృతి మంధానతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ పోస్టులన్నింటినీ పలాష్ డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన
పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన

స్మృతి పోస్టులు

మోసం ఆరోపణలతో పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. స్మృతి మంధాన స్నేహితుడు విద్యన్ మానే అతనిపై కొత్త ఆరోపణలు చేసిన తర్వాత, ముచ్చల్ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్మృతి ఉన్న అనేక పోస్ట్‌లను తొలగించారు. ఈ పోస్ట్‌లన్నీ 24 జనవరి 2026 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కనిపించడం లేదు.

చీటింగ్ ఆరోపణలు

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. 2025 నవంబర్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మెహందీ, సంగీత్ లాంటి ఈవెంట్లు కంప్లీట్ చేసుకున్నారు. కానీ పెళ్లి రోజు మార్నింగ్ స్మృతి తండ్రికి గుండెపోటుతో మ్యారేజీ రద్దయింది. కానీ ఆ తర్వాత స్మృతిని పలాష్ చీట్ చేశాడని, అందుకే పెళ్లి రద్దు చేసుకున్నారనే వార్తలొచ్చాయి. ఓ కొరియోగ్రాఫర్ విషయంలో పలాష్ మోసం బయటపడిందని అన్నారు.

పరువు నష్టం

ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో స్మృతి మంధానతో ఉన్న పోస్టులన్నీ డిలీట్ చేసిన పలాష్ ముచ్చల్.. విద్యన్ మానేపై పరువు నష్టం కేసు వేశాడు. ఓ మూవీ నిర్మాణంలో భాగంగా పలాష్ తనకు రూ.40 లక్షలు ఇవ్వాల్సిందని విద్యన్ ఆరోపించాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వడం లేదన్నాడు. అంతే కాకుండా పెళ్లి ఫిక్స్ కావడానికి ముందే స్మృతిని పలాష్ మోసం చేశాడని కూడా విద్యన్ ఆరోపించాడు.

రూ.10 కోట్లు

విద్యన్ మానే ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పలాష్ ముచ్చల్ రియాక్టయ్యాడు. తన లాయర్ తో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపించానని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు పలాష్. ఆధారం లేని ఆరోపణలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు.

అయితే స్మృతి, పలాష్ వెడ్డింగ్ క్యాన్సిల్ కావడం గతేడాది చివర్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకంటే ముందు వీళ్లు ప్రేమించుకున్నారు. టీమిండియా మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు స్మృతికి పలాష్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పేందుకు అక్కడే ఉన్నాడు. అప్పుడు ప్రపోజ్ కూడా చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More