షాకింగ్.. స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ పెట్టిన క్రికెటర్

భారత క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ వివాహం రద్దయింది. ఈ విషయాన్ని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని కోరుతూ, తాను ముందుకు సాగుతానని ఆమె తెలిపారు.

Dec 7, 2025, 13:39:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడైన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో తన వివాహం రద్దు అయినట్లు ఆమె ప్రకటించింది. ఆదివారం స్మృతి మంధాన ఇన్ స్టాగ్రామ్ లో ఈ సంచలన స్టోరీ పెట్టింది. గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలిచిన ఈ సంబంధానికి ఇలా ఆకస్మాత్తుగా ముగింపు పలికింది.

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్

స్మృతి మంధాన పెళ్లి రద్దు

భారత విమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. తన ప్రియుడు పలాష్ ముచ్చల్ ను ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది. మెహందీ, సంగీత్ లాంటి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ నవంబర్ 23, వెడ్డింగ్ రోజున స్మృతి మంధాన తండ్రికి హార్ట్ స్ట్రోక్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు వివాహం రద్దు అయినట్లు ఆదివారం (డిసెంబర్ 7) స్మృతి మంధాన ఇన్ స్టా స్టోరీ ద్వారా వెల్లడించింది.

ప్రైవసీ కోరుతూ

భారత వైస్-కెప్టెన్ స్మృతి మంధాన ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రైవసీ (గోప్యత)ని కోరుతూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. తాను నిశ్శబ్దంగా ముందుకు సాగాలనే తన కోరికను నొక్కి చెప్పింది. ముచ్చల్‌తో ఇప్పుడు రద్దు అయిన వివాహం చుట్టూ తిరుగుతున్న విపరీతమైన ఊహాగానాలతో మంధాన బాధపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. శాంతి, నిశ్శబ్దాన్ని కోరింది.

ఇన్ స్టా పోస్ట్

"గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈ సమయంలో మాట్లాడటం. ముఖ్యమని భావిస్తున్నా. నేను చాలా గోప్యతను పాటించే వ్యక్తిని. నేను ఆ విధంగానే ఉంచాలనుకుంటున్నా. కానీ వివాహం రద్దు అయిందని నేను స్పష్టం చేయాలి. నేను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నా. మీ అందరినీ కూడా అలాగే చేయమని కోరుతున్నా. దయచేసి ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని, మాకు మా స్వంత వేగంతో ప్రాసెస్ చేయడానికి, ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా’’ అని ఇన్ స్టా స్టోరీలో స్మృతి మంధాన పేర్కొంది.

స్మృతి మంధాన ఇన్ స్టా స్టోరీ (instagram)
స్మృతి మంధాన ఇన్ స్టా స్టోరీ (instagram)

దేశం కోసం ట్రోఫీలు

‘‘మనందరినీ నడిపించే ఉన్నతమైన ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నా. నాకు అది ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం. నేను వీలైనంత కాలం భారతదేశం కోసం ఆడుతూ ట్రోఫీలను గెలుచుకోవాలని ఆశిస్తున్నా. నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది" అని స్మృతి మంధాన స్టోరీలో ప్రకటించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More