OTT Review: ఓటీటీలో కాదు ఈ సినిమా థియేటర్లలో రావాల్సింది, మజా వచ్చింది- యాక్షన్ థ్రిల్లర్ మూవీపై డైరెక్టర్ ఓటీటీ రివ్యూ
Anurag Kashyap Review On OTT Movie Subedaar: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అనిల్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ ‘సుబేదార్’పై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను థియేటర్లలో చూసుంటే ఆ మజా వేరేలా ఉండేదని, అనిల్ కపూర్ నటనలో ఇంకా ఆ పాత సెగ తగ్గలేదని కొనియాడారు.
బాలీవుడ్ సీనియర్ హీరో, యానిమల్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుబేదార్’ (Subedaar) మార్చి 5 నుంచి నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన సుబేదార్ మూవీ ఓటీటీ రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.

కానీ, అనిల్ కపూర్ నటనకు మాత్రం అందరూ జై కొడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సుబేదార్ మూవీపై తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల కావాల్సింది అంటూ అనురాగ్ కశ్యప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
థియేటర్ల కోసం డిజైన్ చేసిన సినిమా!
శనివారం (మార్చి 7) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అనిల్ కపూర్ ఫోటోను షేర్ చేస్తూ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. "సుబేదార్ సినిమా కచ్చితంగా థియేటర్లలోనే విడుదలవ్వాల్సింది. పెద్ద తెర మీద చూస్తే ఆ అనుభూతే వేరుగా ఉండేది" అని అనురాగ్ కశ్యప్ అన్నారు.
"సుబేదార్ దర్శకుడు సురేష్ త్రివేణి బుందేల్‌ఖండ్, చంబల్ ప్రాంతాల్లోని పితృస్వామ్య వ్యవస్థను, అక్కడి మనుషుల ప్రవర్తనను చాలా సహజంగా చూపించారు. పూలన్ దేవి వంటి వారు పుట్టిన ఆ గడ్డ మీద మహిళలు కూడా పురుషులతో సమానంగా పోరాడతారని ఈ సినిమా మరోసారి గుర్తు చేసింది" అని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.
అనిల్ కపూర్ నటనలో ఆ పాత సెగ!
నటీనటుల ప్రతిభ గురించి అనురాగ్ కశ్యప్ చెబుతూ.. "మేరీ జంగ్, తేజాబ్ సినిమాల్లోని అనిల్ కపూర్ ఇంకా తనలోని సెగను ఇంకా అలాగే మోస్తున్నాడు. ఫుల్ ఫైర్‌తో నటించారు. ఇక మోనా సింగ్ చేయలేని పాత్ర అంటూ ఏదీ లేదు. ఆదిత్య రావల్ విలనిజం చూస్తుంటే నిజంగానే అసహ్యం కలిగించేలా అద్భుతంగా చేశాడు" అని తెలిపారు.
"ఇక రాధికా మదన్ తన నటనతో మెరిసిపోయింది. అసలు సౌరభ్ శుక్లా (కల్లు మామ) యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని నేను 2026 క్యాలెండర్‌లో అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా మజా వచ్చింది సార్" అని అనురాగ్ కశ్యప్ రివ్యూ ఇస్తూ సుబేదార్ మూవీని ప్రశంసించారు.
నాకు నచ్చిన కమర్షియల్ సినిమా
నేటి కాలంలో అందరూ అతిగా ఉండే యాక్షన్ సీన్ల వెంట పడుతుంటే, ఈ సినిమాలో మాత్రం చాలా రియలిస్టిక్‌గా, అవసరమైన మేరకే యాక్షన్ ఉండటం తనను బాగా ఆకట్టుకుందని అనురాగ్ కశ్యప్ తెలిపారు. హైవే ఛేజ్ సీక్వెన్స్ కూడా అద్భుతంగా ఉందని, ఇది తనలాంటి వాడికి నచ్చే, నచ్చిన కమర్షియల్ సినిమా అని అనురాగ్ కశ్యప్ ముగించారు.
అసలు ‘సుబేదార్’ కథేంటి?
సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన సుబేదార్ సినిమా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అర్జున్ సింగ్ కథ. సమాజంలో వేగంగా మారుతున్న పరిస్థితులు, స్థానిక అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసే పోరాటమే ఈ సినిమా. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే క్లిష్టమైన బంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
మధ్యప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో అనిల్ కపూర్‌తో పాటు రాధికా మదన్, ఖుష్బూ సుందర్, సౌరభ్ శుక్లా, మోనా సింగ్ వంటి హేమాహేమీలు నటించారు. మార్చి 5న అమెజాన్ ప్రైమ్‌లో సుబేదార్ ఓటీటీ రిలీజ్ అయింది. హిందీతోపాటు తెలుగు, తమిళం వంటి 3 భాషల్లో సుబేదార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


