69 ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జీ- ఫిట్‌గా ఉండటానికి అసలు కారణం అదే- సీక్రెట్ చెప్పిన సీనియర్ హీరో, యానిమల్ నటుడు అనిల్ కపూర్!

యానిమల్ సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరో అనిల్ కపూర్.  తన అంతులేని ఉత్సాహానికి కారణం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనిల్ కపూర్. తన తాజా చిత్రం సుబేదార్ ఓటీటీ రిలీజ్ కానున్న నేపథ్యంలో అనిల్ కపూర్ పంచుకున్న ఆసక్తికర విషయాలపై లుక్కేద్దాం.

Feb 16, 2026, 10:00:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ వెండితెరపై దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ, వయసు పెరుగుతున్నా తరగని ఉత్సాహంతో దూసుకుపోతున్న ఎవర్ గ్రీన్ హీరో అనిల్ కపూర్. ప్రస్తుతం ఆయన వయసు 69 ఏళ్లు. ఈ వయసులోనూ యువ హీరోలకు పోటీనిచ్చేలా ఆయన ప్రదర్శించే ఎనర్జీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు.

69 ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జీ- ఫిట్‌గా ఉండటానికి అసలు కారణం అదే- సీక్రెట్ చెప్పిన సీనియర్ హీరో, యానిమల్ నటుడు అనిల్ కపూర్! (PTI)
69 ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జీ- ఫిట్‌గా ఉండటానికి అసలు కారణం అదే- సీక్రెట్ చెప్పిన సీనియర్ హీరో, యానిమల్ నటుడు అనిల్ కపూర్! (PTI)

ఇంటర్వ్యూలలో కానీ, బహిరంగ వేదికలపై కానీ అనిల్ కపూర్ కనిపించారంటే అక్కడ సందడి వేరేలా ఉంటుంది. అయితే, తనలోని ఈ నిరంతర శక్తికి కారణం ఏంటో అనిల్ కపూర్ తాజాగా రివీల్ చేశారు.

నా ఎనర్జీకి కారణం ఆ 'భయం'

ఇటీవల 'స్క్రీన్' మ్యాగజైన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కపూర్‌ను మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటని ప్రశ్నించగా.. ఆయన ఎంతో నిజాయతీగా సమాధానమిచ్చారు.

"నాలోని ఈ ఎనర్జీకి నా 'అభద్రతా భావం' (Insecurity) కూడా ఒక కారణమని నేను భావిస్తాను. నాకు ఎప్పుడూ పని చేయాలనే తపన ఉంటుంది. నేను ఫిట్‌గా ఉంటూ, ఉత్సాహంగా కనిపిస్తేనే నాకు మంచి అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీలో నేను ఎప్పుడూ సంబంధిత వ్యక్తిగా (Relevant) ఉండాలనే కోరిక నాలో ఆ శక్తిని నింపుతుంది" అని అనిల్ కపూర్ పేర్కొన్నారు.

అందుకోమే ఈ ఫిట్‌నెస్

అంతేకాకుండా, "నేను ఇక్కడ కావాలని నటించడం లేదు. మంచి పని చేయాలనేది నా ప్రధాన లక్ష్యం. నా పని చూసి దర్శకుడు సంతోషించాలి. నా శక్తి సామర్థ్యం మేరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. బహుశా నేను ఇంకా మెరుగ్గా పని చేయలేకపోతున్నానేమో, నాకంటే గొప్ప నటులు ఉన్నారేమో, నేను ఇంకా చాలా నేర్చుకోవాలేమో అనే భావన నాలో ఎప్పుడూ ఉంటుంది. ఆ మెరుగుదల కోసమే నాకు ఈ ఫిట్‌నెస్, ఎనర్జీ అవసరం" అని అనిల్ కపూర్ వివరించారు.

మార్చి 5న అమెజాన్ ప్రైమ్‌లో ‘సుబేదార్’

ఆయన మాటలకు అక్కడున్న ప్రేక్షకుల నుంచి భారీగా చప్పట్లు వినిపించాయి. ఇదిలా ఉంటే, అనిల్ కపూర్ చివరి సారిగా 'వార్ 2'లో కల్నల్ విక్రాంత్ కౌల్ పాత్రలో మెప్పించారు. ఇప్పుడు అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘సుబేదార్’ (Subedaar) విడుదలకు సిద్ధమైంది. ఇందులో రాధికా మదన్ కీలక పాత్ర పోషించగా.. సౌరభ్ శుక్లా, మోనా సింగ్, ఆదిత్య రావల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సుబేదార్ ఓటీటీ రిలీజ్

సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా, అనిల్ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సుబేదార్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా సుబేదార్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా అనిల్ కపూర్ చేసే యాక్షన్ విన్యాసాలు చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తండ్రి పాత్రలో నటించిన అనిల్ కపూర్ తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More