ఈ నగరానికి ఏమైంది 2లో మారిన నటుడు- సుశాంత్ రెడ్డి ప్లేసులో హిట్, యానిమల్ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి?
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చిత్రం నుంచి కార్తీక్ పాత్ర నటుడు మారిపోయిన విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్ రెడ్డి ప్లేసులో మరో టాలెంటెడ్ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి నటించినున్నట్లు సమాచారం. శ్రీనాథ్ హిట్, యానిమల్ సినిమాలతో నటుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఈ నగరానికి ఏమైంది సినిమా టాలీవుడ్‌లో ఒక బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాలోని నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిందే. ఆ ఫ్రెండ్స్ చేసిన అల్లరి, కామెడీ ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్యాంగ్ మనసుల్లో ముద్ర వేసుకున్నాయి.

జీవం పోసిన నటులు
ఆ పాత్రలకు అంతలా జీవం పోసింది అవి పోషించిన నటులు కూడా అని చెప్పుకోవచ్చు. అలాంటి పాత్రలో జీవించిన నటుడు మారిపోతే. అవును, ఇప్పుడు అదే జరిగింది. రీసెంట్‌గా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ నుంచి కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్ రెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పంచుకున్నారు. సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఈ నగరానికి ఏమైంది 2 నుంచి వైదొలిగినట్లు తరుణ్ భాస్కర్ వివరించారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా ఆ కార్తీక్ పాత్రను ఎవరు చేస్తారు అనే క్యూరియాసిటీ నెలకొంది.
టాలెంటెడ్ నటుల్లో
ఈ నేపథ్యంలో ఈ నగరానికి ఏమైంది 2 సినిమాలో సుశాంత్ రెడ్డి ప్లేసులో యాక్టర్ శ్రీనాథ్ మాగంటి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ అండ్ టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో శ్రీనాథ్ మాగంటి పేరు తప్పకుండా వినిపిస్తుంది.
'హిట్' ఫ్రాంచైజీలో అభిలాష్ పాత్రలో శ్రీనాథ్ నటన పలు ప్రశంసలు అందుకుంది. 'లక్కీ భాస్కర్'లోనూ సూరజ్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్'తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఆ సినిమాలో రష్మిక మందన్నా బ్రదర్ రోల్ చేశారు.
నలుగురు స్నేహితుల చుట్టూ
ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి ఈ నగరానికి ఏమైంది 2 వంటి క్రేజీ ప్రాజెక్టులో హీరోగా నటించనున్నారు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన కల్ట్ ఫిల్మ్ 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. నలుగురు స్నేహితుల చుట్టూ నడిచే కథతో 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తీసిన విషయం తెలిసిందే.
తరుణ్ భాస్కర్ జీవితంలో జరిగిన సంఘటనలు, స్నేహం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. 'ఈ నగరానికి ఏమైంది 2' స్క్రిప్ట్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాశారు. అందులో శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్ర పాత్ర చేస్తున్నారు. అంటే, నలుగురు హీరోల్లో ఆయన కూడా ఒకరు.
శ్రీనాథ్ చేస్తున్నాడా?
ఇకపోతే ఈ నగరానికి ఏమైంది 2లో సుశాంత్ లేకపోయిన కార్తీక్ ప్రయాణం కొనసాగుతుందని తరుణ్ భాస్కర్ చెప్పారు. ఇప్పుడు ఆ రోల్ శ్రీనాథ్ మాగంటి చేస్తున్నారా అంటూ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. మరి కార్తీక్ పాత్రను శ్రీనాథ్ మాగంటి చేస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


